మొలకలు ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
21 March 2025
TV9 Telugu
TV9 Telugu
మొలకలు తింటే మంచిదని మనందరికి తెలుసు. కానీ వాటిని నానబెట్టి, మళ్లీ ఆ నీళ్లని వడకట్టి.. మొలకలు రావడానికని ఓ వస్త్రంలో చుట్టి పెడుతుంటాం. చాలామంది ఇవన్నీ చేయడానికి బద్ధకించి ఊరుకుంటారు
TV9 Telugu
నిజానికి, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక పోషకాలతో సమృద్ధిగా ఉండే మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే మొలకలను సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో అత్యధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజూ తినడం ద్వారా కడుపు ఆరోగ్యంగా ఉంటుంది
TV9 Telugu
అయితే కొందరు గింజలను మొలకెత్తించి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా రక్తపోటు సమస్య ఉన్నవారు పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి
TV9 Telugu
100 గ్రాముల పెసర మొలకల్లో దాదాపు 1246 mg పొటాషియం ఉంటుంది. కాబట్టి, ఇలాంటి వారు దీనిని తినకపోవడమే మంచిది
TV9 Telugu
మూత్రపిండాల సంబంధిత సమస్యలున్న వారు కూడా వీటిని తినకూడదు. ఎందుకంటే అధిక పొటాషియం మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ప్రోటీన్ తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలు మరింత పెరుగుతాయి
TV9 Telugu
చర్మ అలెర్జీ ఉన్నవారు మొలకలు వంటి వాటిని వైద్యుడి సలహా మేరకు మాత్రమే తినాలని నిపుణులు అంటున్నారు. అటువంటి వారిలో సమస్య మరింత పెరగవచ్చు
TV9 Telugu
అలాగే ఒక్కోసారి శరీరంలో యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. దాని స్థాయి ఎక్కువగా ఉంటే కీళ్లలో నొప్పి వస్తుంది. యూరిక్ యాసిడ్ పెరుగుతుంటే దానికి గల అనేకానేక కారణాల్లో ఒకటి అధిక ప్రోటీన్ తీసుకోవడం కూడా
TV9 Telugu
అటువంటి రోగులు నిపుణుల సలహా మేరకు మాత్రమే ప్రోటీన్ తీసుకోవాలి. ఇప్పటికే మలబద్ధకం ఉన్నవారు మొలకలను పరిమిత పరిమాణంలో తినాలి. మూంగ్ పప్పు ఫైబర్ కు మంచి మూలం, కానీ దీనిని అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గడానికి బదులుగా పెరుగుతుంది