Telangana: తెల్లారి గొర్రెలకు మేత వేసేందుకు వచ్చిన కాపరి.. ఎదురుగా కనిపించిన సీన్ చూసేసరికి..
తెల్లారి గొర్రెలకు మేత వేసేందుకు వచ్చిన కాపరికి.. ఎదురుగా కనిపించింది చూడగా ఒక్కసారిగా షాక్.. ఆ క్షణంలో ఏం చేయాలో.. అతడికి అర్ధం కాలేదు. ఈ ఘటన వరంగల్ లో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

గుంటూరు జిల్లా నుంచి వరంగల్‌కు వలస వచ్చి ఖిలా వరంగల్‌లో గొర్రెల పెంపకం ద్వారా జీవనోపాధి చెందుతున్న కుటుంబంపై గుర్తుతెలియని వ్యక్తులు కక్షగట్టారు. వాళ్ల గొర్రెల పెంపకం షెడ్డుకు నిప్పు పెట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు చేసిన ఈ ఘటనలో 300లకు పైగా గొర్రెలు సజీవ దహనమయ్యాయి. అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
ఖిలా వరంగల్‌లోని మట్టికోట పక్కనే దుగ్గిరాల లక్ష్మణ్ అనే వ్యక్తి గొర్రెల పెంపకం చేస్తున్నాడు. ఒక షెడ్డు వేసి అందులో గొర్రెలను పెంచుతూ వాటి పాలు, ఎరువులు, గొర్రెల విక్రయాల ద్వారా జీవనోపాధి పొందుతున్నాడు. షెడ్డులో 300లకు పైగా గొర్రెలు ఉన్నాయి. నిన్న అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు షెడ్డుకు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి షెడ్డు మొత్తం మంటల్లో అంటుకుంది. ఈ మంటల్లో షెడ్డులోని గొర్రెలు సజీవ దహనం అయ్యాయి.
అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోపే షెడ్డులోని గొర్రెలు మొత్తం మృతి చెందాయి. వీటి పెంపకం ద్వారా జీవనోపాధి చెందుతున్న లక్ష్మణ్ కుటుంబం బోరున విలపిస్తున్నారు. ఎవరో గుర్తుతెలియని దుండగులు పగతో ఈ దారుణానికి ఒడిగట్టారని రోదిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా.! లేక ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగి గొర్రెలు మొత్తం సజీవదహనం అయ్యాయా..! అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.