AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush And Aishwarya: విడాకుల తర్వాత కామన్‌ ఫ్రెండ్‌ పార్టీలో ధనుష్‌, ఐశ్వర్య.. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య (Aishwarya).. తమ వైవాహిక జీవితానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టారు

Dhanush And Aishwarya: విడాకుల తర్వాత కామన్‌ ఫ్రెండ్‌ పార్టీలో ధనుష్‌, ఐశ్వర్య.. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..
Dhanush And Aishwarya
Basha Shek
|

Updated on: Mar 01, 2022 | 9:15 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య (Aishwarya).. తమ వైవాహిక జీవితానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టారు. పెళ్లైన 18 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వేర్వేరుగా ప్రకటించారు. కాగా విడాకుల ప్రకటన అనంతరం తమ వ్యక్తిగత పనుల్లో బిజీ అయిపోయారు ధనుష్‌, ఐశ్వర్య. ఎప్పటిలాగే ధనుష్‌ తన సినిమా షూటింగుల్లో తలమునకలు కాగా.. డైరెక్షన్‌లో అభనుభవమున్న ఐశ్వర్య కూడా తన తదుపరి ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు జరుపుతోంది. అయితే ఈ మాజీ దంపతులను కలపడానికి ఇద్దరి తరపు కుటుంబీకులు, బంధువులు ప్రయత్నించారని అయినా సఫలం కాలేదని సమాచారం. అందుకు తగ్గట్లే ధనుష్ తండ్రి కస్తూరి రాజా కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ ధనుష్‌, ఐశ్వర్య త్వరలోనే కలసిపోతారని, ఒక శుభవార్త వింటారని ప్రకటించారు. అయితే అలాంటివేమీ జరగలేదు.

కాగా ప్రస్తుతం ధనుష్ ‘సార్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందుకోసం గత కొన్ని రోజులుగా భాగ్యనగరంలోనే ఉంటున్నాడు ఈ కోలీవుడ్‌ స్టార్‌. ఇక ఐశ్వర్య కూడా ఓ పాట షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లోనే ఉంటుంది.. అయితే ఇద్దరూ ఒకే హోటల్‌లో ఉన్నప్పటికీ ఒకరినొకరు కనీసం మాట్లాడుకోలేదని తమిళ మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇటీవల ధనుష్, ఐశ్వర్యలు ఓ కామన్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీకి హాజరయ్యారట. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో గ్రాండ్‌గా ఈ పార్టీ జరిగింది. కాగా పార్టీకి వచ్చిన అతిథులంతా ధనుష్‌, ఐశ్వర్య మాట్లాడుకుంటారమోనని ఆసక్తిగా ఎదురు చూశారట. అయితే అక్కడ కూడా వారు దూరంగానే ఉన్నారట. కనీసం మాటవరుసకైనా ఒకరినొకరు మాట్లాడుకోలేదట. దీంతో వీరిద్దరూ మళ్లీ కలిసిపోతారన్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని తెలుస్తోంది.

Also Read:జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల.. ఎన్టీఏ కీలక నిర్ణయం.. వివరాలివే

పండుగపూట విషాదం.. చెట్టును ఢీ కొట్టిన కారు.. ఆరుగురు మృతి

IPL Broadcasting Rights: ఆదాయం కోసం బీసీసీఐ భారీ స్కెచ్.. వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రసారాల్లో కీలక మార్పులు?

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC