Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peepal Tree: రావిచెట్టుని పూజిస్తే అద్భుత ఫలితాలు.. ఆ బాధలన్నింటికి చక్కటి పరిష్కారం..

Ravi Tree: రావిచెట్టుని అందరు చూసే ఉంటారు. దాదాపు ప్రతి ఆలయంలో ఉంటుంది. ప్రాచీనకాలం నుంచి హిందూమతంలో రావిచెట్టుని పూజించడం ఒక ఆచారంగా వస్తుంది. దీనినే

Peepal Tree: రావిచెట్టుని పూజిస్తే అద్భుత ఫలితాలు.. ఆ బాధలన్నింటికి చక్కటి పరిష్కారం..
Peepal Tree
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Mar 01, 2022 | 7:19 PM

Ravi Tree: రావిచెట్టుని అందరు చూసే ఉంటారు. దాదాపు ప్రతి ఆలయంలో ఉంటుంది. ప్రాచీనకాలం నుంచి హిందూమతంలో రావిచెట్టుని పూజించడం ఒక ఆచారంగా వస్తుంది. దీనినే భోధి వృక్షం అని కూడా పిలుస్తారు. ఈ చెట్టుకి చాలా ప్రత్యేకత ఉంది. రావిచెట్టును భగవంతుని రూపంగా కొలుస్తారు. ఎందుకంటే రావిచెట్టు రాత్రి పూట ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది. రాత్రి పూట ఆక్సిజన్ అందించే అతి తక్కువ చెట్లలో రావిచెట్టు ఒకటి. గాలిలో ఉన్న అనేక రకాల బ్యాక్టీరియాలను నాశనం చేసే శక్తి రావిచెట్టులో ఉంటుంది. ఈ చెట్టు ఆకులను, బెరడును పూర్వకాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. రావి చెట్టు బెరడుని బాగా పండిన రావి పండ్లను తీసుకొని మిశ్రమంగా తయారు చేసుకొని ప్రతిరోజూ మూడు సార్లు తీసుకుంటే ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. రావిచెట్టు ఇంకా ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది.

పురాణాల ప్రకారం.. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ దివ్య అస్త్రాలను రావిచెట్టు మీద దాచారని చెబుతారు. రావిచెట్టు మీద లక్ష్మి దేవి నివాసం ఉంటుందని అందుకే అందరు పూజిస్తారని అంటారు. అంతేకాదు ఈ చెట్టుని పూజించడం వల్ల లక్ష్మి కటాక్షం లభిస్తుందని నమ్మకం. అంతేకాకుండా వివాహ సమస్యలు, సంతాన ప్రాప్తి, శని బాధలు, ఆరోగ్య సమస్యలు మొదలైనవన్ని తొలగిపోతాయి. రావి చెట్టు పండ్లను తింటే అంటే ఆకలి లేని వారికి ఆకలి బాగా పెరుగుతుంది. జీర్ణాశయంలో మంట తగ్గుతుంది. జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడానికి రావి చెట్టు ఆకులు దోహదపడతాయి. రావిచెట్టుకింద ఉంటే మంచి ఆక్సిజన్ లభిస్తుంది.

రావి చెట్టు ఆకులను ముద్దగా నూరి రసం తీసుకోవాలి ఈ రసాన్ని రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గుతుంది. చెవిలో ఇన్ఫెక్షన్ ఉంటే పోతుంది. రావి చెట్టు పండ్లను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. అర టీ స్పూన్ ఈ పొడిని పాలతో కలిపి తీసుకుంటే పురుషులలో నపుంసకత్వం సమస్య తగ్గుతుంది. రావి చెట్టు బెరడుని నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిని నోట్లో పోసి పుక్కిలిస్తే నోటి దుర్వాసన, చిగుళ్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. బాగా పండిన రావిచెట్టు పండ్లను తింటే మలబద్ధకం తగ్గుతుంది. రావి చెట్టు ఆకులను రాత్రి పూట గ్లాసు నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఈ ఆకులను తీసేసి మూడు పూటలా తాగితే గుండె ఆరోగ్యం మెరుగ్గు ఉంటుంది.

Maha Shivaratri 2022: శివరాత్రి జాగారం చేస్తున్నారా.. లింగోద్భవ సమయం ఎప్పుడో తెలుసా..!

Kidney Stone: కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి ఈ ఆకుకూర విషంతో సమానం.. అస్సలు తినకండి..!

గోడకి ఫిట్ చేసుకునే కూలర్ గురించి విన్నారా.. తక్కువ ఖర్చుతో ఏసీలాంటి చల్లదనం..!