మహిళలు ఇది మీకే.. చీరలకు ఫాల్ ఎందుకు వేయాలో తెలుసా?
Samatha
18 February 2026
మగువలు ఎక్కువగా ఇష్టపడేది చీరలు. ఏ చిన్న పార్టీ, ఫంక్షన్ జరిగినా సరే వీరు ముందుగా చీర కొనుగోలు చేయడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు.
చీరలు
ఇక కొంత మంది ఏ సారీ ఇన్ స్టాలో ట్రెండ్ అవుతుందో దానిని కొనుగోలు చేస్తారు. ఇక ఇందులో సిల్క్ , బెనారస్, కంచి పట్ట అని రకరకాల చీరలు ఉంటాయి.
ట్రెండింగ్ చీరలు
ఇక చీర కొనుగోలు చేసిన తర్వాత మొదట చేసే పని పికో, ఫాల్ వేయించడం. అయితే కొంత మంది చీరలకు ఫాల్ వేయించడానికి ఇష్టపడరు. కాగా, అసలు చీరలకు ఫాల్ ఎందుకు వేయించాలో ఇప్పుడు చూద్దాం.
పికో, ఫాల్
ఏ చీరలకు అయినా సరే ఫాల్ అనేది ఆ చీరల రక్షణకు దోహద పడుతుందంట. ముఖ్యంగా చీరల బోర్డర్ త్వరగా పాడవకుండా, ముడతలు పడకుండా కాపాడుతుందంట.
ఫాల్
అలాగే కొంత మందిని చూస్తే చీర చివరలో అంచు దగ్గర పాడై, చీర పైన మొత్తం బాగుంటుంది. అయితే అలా చీర చివరన పాడవకుండా ఉండాలంటే, తప్పకుండా ఫాల్ వేయించుకోవాలంట.
చీరకు రక్షణ
అంతే కాకుండా ఏ చీరలకు అయితే ఫాల్ ఉంటుందో, ఆ చీరల కుచ్చిళ్లు నీటుగా ఉండటమే కాకుండా, కట్టుకున్నప్పుడు, ప్రత్యేకమైన కలను తీసుకొస్తుందంట.
కుచిళ్ళు నీటుగా
అయితే కొందరిలో ప్రతి సారీకి ఫాల్ అవసరమా అనే డౌట్ ఉంటుంది. కానీ అన్నింటికీ కాకుండా,సిల్క్, నెట్,షిఫాన్ జార్జెట్, బోర్డర్ ఉన్న చీరలకు తప్పనిసరిగా ఫాల్ వేయించాలంట.