Ramarao on Duty: మాస్‌ మహరాజా ఫ్యాన్స్‌కు మహాశివరాత్రి సర్‌ప్రైజ్‌.. అలరిస్తోన్న రామారావు యాక్షన్‌ టీజర్‌..

Ravi Teja: క్రాక్‌ లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత ఖిలాడీ సినిమాతో మన ముందుకు వచ్చారు మాస్‌ మహరాజా రవితేజ (Ravi Teja). యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది

Ramarao on Duty: మాస్‌ మహరాజా ఫ్యాన్స్‌కు మహాశివరాత్రి సర్‌ప్రైజ్‌.. అలరిస్తోన్న రామారావు యాక్షన్‌ టీజర్‌..
Ramarao On Duty
Follow us
Basha Shek

|

Updated on: Mar 01, 2022 | 5:27 PM

Ravi Teja: క్రాక్‌ లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత ఖిలాడీ సినిమాతో మన ముందుకు వచ్చారు మాస్‌ మహరాజా రవితేజ (Ravi Teja). యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తన జోరును అలాగే కొనసాగించేందుకు త్వరలో ‘రామరావు ఆన్‌ డ్యూటీ’ (Ramarao on Duty) అంటూ రెడీ అవుతున్నారు రవితేజ. శరత్‌ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో డిప్యూటీ కలెక్టర్‌ పాత్రలో కనిపించనున్నారు మాస్‌ మహరాజా. దివ్యాన్ష కౌశిక్‌, రజిషా విజయన్‌ రవితేజతో రొమాన్స్‌ చేయనున్నారు. గతంలో పలు సినిమాల్లో నటించిన వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కాగా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రవితేజ అభిమానులు, సినీ అభిమానులకు మరో కానుక అందించింది రామారావు చిత్ర బృందం. సోషల్‌ మీడియా వేదికగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది.

‘ పేరు సింపుల్‌గా ఉన్నా.. వాడు సూపర్‌ మ్యాన్‌’ అంటూ డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్‌లో రవితేజ మరోసారి అదరగొట్టాడు. ఆద్యంతం యాక్షన్‌ సన్నివేశాలతో సాగే ఈ టీజర్‌ మాస్‌ మహరాజా అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ‘ఆయుధం మీద ఆధారపడి నీలాంటి వాడి ధైర్యం వాడే ఆయుధంలో ఉంటుంది.. ఆయుధంలా బతికే నా లాంటి వాడి ధైర్యం అణువణువునా ఉంటుంది. ‘క్రిమినల్స్ విల్‌ బి పనిష్డ్‌.. నో మ్యాటర్‌ వాట్‌ ఈవెన్‌ దో దేర్‌ ఈజ్‌ నో ఎవిడెన్స్‌( క్రిమినల్స్‌ శిక్షించబడాలి, ఆధారాలు లేకపోయినా’ అని రవితేజ నోటి నుంచి వచ్చిన డైలాగులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్బ్‌గా ఉంది. టీజర్‌లో రవితేజ ఎనర్జీ చూస్తుంటే మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాజర్‌, నరేశ్‌, జాన్‌ విజయ్‌, పవిత్రా లోకేష్‌, తనికెళ్ల భరణి, రాహుల్‌ రామకృష్ణ, సురేఖా వాణి, చైతన్య కృష్ణ తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read:Kacha Badam Telugu Version: ‘పల్లీ పల్లీ.. ఇది పచ్చీ పల్లి’.. యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోన్న కచా బాదం తెలుగు వెర్షన్‌.. మీరూ ఓ లుక్కేయండి మరీ..

Actor Sunil: హీరోగా రెండు సినిమాలను అనౌన్స్ చేసిన సునీల్.. ఈసారి పోలీస్ పాత్రలో మరింత పవర్‌ఫుల్‌ గా..

Chor Bazaar: పాతికేళ్ల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తోన్న జాతీయ ఉత్తమ నటి.. ఆకాశ్ పూరీ సినిమాతో సెకెండ్‌ ఇన్సింగ్స్‌..

వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం