Chor Bazaar: పాతికేళ్ల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తోన్న జాతీయ ఉత్తమ నటి.. ఆకాశ్ పూరీ సినిమాతో సెకెండ్ ఇన్సింగ్స్..
'ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది'.. అంటూ ఎంతో హృద్యంగా సాగే ఈ పాట చాలామందికి ఫేవరేట్ సాంగ్. నిరీక్షణ సినిమాలోని ఈ ఎవర్‌గ్రీన్ పాటను ఎప్పుడు గుర్తు చేసుకున్నా మన కళ్ల ముందు ఓ అమాయకరూపం మెదులుతుంది
‘ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది’.. అంటూ ఎంతో హృద్యంగా సాగే ఈ పాట చాలామందికి ఫేవరేట్ సాంగ్. నిరీక్షణ సినిమాలోని ఈ ఎవర్‌గ్రీన్ పాటను ఎప్పుడు గుర్తు చేసుకున్నా మన కళ్ల ముందు ఓ అమాయకరూపం మెదులుతుంది. ఆమె అలనాటి అందాల తార అర్చన (Archana). తన అందం, అభినయంతో జాతీయ పురస్కారంతో పాటు ఎందరో ప్రముఖుల మన్ననలు అందుకున్నారు ఈ సీనియర్ నటీమణి. తెలుగులో ఆమె నటించిన నిరీక్షణ, భారత్ బంద్, లేడీస్ టైలర్, చక్రవ్యూహం, పచ్చతోరణం, మట్టి మనషులు తదితర చిత్రాలు మంచి విజయం సాధించాయి. కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల తార ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వస్తోంది. సుమారు పాతికేళ్ల తర్వాత వెండితెరపైకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. అదే పూరీ ఆకాశ్ హీరోగా నటిస్తోన్న ‘చోర్ బజార్’ (Chor Bazaar). ఈ సినిమాలో అర్చన ఆకాశ్ (Akash Puri) తల్లిగా నటించనున్నట్లు సమాచారం. తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ చిత్రబృందం ఓ వీడియో విడుదల చేసింది.
బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి. ఆంధ్రాపోరి, మెహబూబా నటించిన ఈ యంగ్ హీరో గతేడాది ‘రొమాంటిక్’ సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు. నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్నాడు. కాగా ఇప్పుడు తన జోరును అలాగే కొనసాగించే పనిలో ఉన్నాడు. అందులో భాగంగా ‘చోర్ బజార్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. గెహనా సిప్పీ కథానాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవన్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీయస్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆకాశ్ పూరీ బర్త్ డేను పురస్కరించుకుని ఇటీవల ‘చోర్ బజార్’ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Team #Chorbazaar is excited to have National Award Winner #Archana Garu on board!@actorakashpuri @gehna_sippy @GeorgeReddyG1 @IVProductions_ @vsraju_subbu @sureshvarmaz @DopJagadeeshCh @GskMedia_PR @LahariMusic @SureshKondi_ pic.twitter.com/AFHh5KgJEX
— BA Raju’s Team (@baraju_SuperHit) March 1, 2022
Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి మృతి.. రష్యా బాంబు దాడిలో మరణించిన నవీన్..
ఈ స్కీంలో పెట్టుబడి పెడితే నెలకి రూ. 4,950 వడ్డీ.. ఎఫ్డీలతో పోల్చితే చాలా ఎక్కువ..!