AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి మృతి.. రష్యా బాంబు దాడిలో మరణించిన నవీన్‌..

ఉక్రెయిన్‌పై రష్యా చేసిన బాంబు దాడిలో భారతీయ విద్యార్థి మృతి చెందాడు...

Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి మృతి.. రష్యా బాంబు దాడిలో మరణించిన నవీన్‌..
Naveen
Follow us
Srinivas Chekkilla

| Edited By: Ravi Kiran

Updated on: Mar 01, 2022 | 8:01 PM

భయపడిందే జరిగింది. ఉక్రెయిన్‌-రష్యా యుద్దాని(Russia Ukraine war)కి భారతీయ విద్యార్ధి బలయ్యాడు. ఖార్కీవ్‌లో క్షిపణి షెల్స్‌ మీద పడడంతో భారతీయ విద్యార్ధి నవీన్‌(Naveen) చనిపోయాడు. కర్ణాటక(Karnataka)లోని హవేరి హావేరి జిల్లా చెళగేరి గ్రామానికి చెందిన నవీన్‌ ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చేస్తున్నాడు. మెడిసిన్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్‌ యుద్ధంలో చిక్కుకొని ప్రాణాలను కోల్పోవడం అందరిని కలిచివేస్తోంది. 21 ఏళ్ల నవీన్‌ ఖార్గీవ్‌ యూనివర్సిటీలో మెడిసిన్‌ చదువుతున్నాడు.

క్షిపణి దాడిలో నవీన్ మరణించిన విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ధృవీకరించింది. నవీన్‌ మృతిపై తీవ్ర సంతాపం తెలిపింది. కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని విదేశంగా శాఖా ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. నవీన్‌ కుటుంబంతో టచ్‌లో ఉన్నామని విదేశాంగశాఖ వెల్లడించింది. ఉదయం ఆహారం కోసం సూపర్‌ మార్కెట్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. మిస్సైల్‌ షెల్‌ మీద పడడంతో నవీన్ అక్కడికక్కడే చనిపోయాడు.

naveen passport

naveen passport

నవీన్‌ మృతితో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన తెలియగానే భారీ సంఖ్యలో గ్రామస్థులు నవీన్‌ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. కర్ణాటక సీఎం బస్వరాజ్‌ బొమ్మై కూడా నవీన్‌ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్ధుల భద్రతపై విదేశాంగశాఖ తీవ్ర ఆందోళనలో ఉంది. భారత్‌లో రష్యా , ఉక్రెయిన్‌ రాయబారులతో ఈవిషయంపై చర్చించారు విదేశాంగశాఖ కార్యదర్శి హర్ష్‌ ష్రింగ్లా. ఖార్కీవ్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులు రష్యా సరిహద్దుల మీదుగా స్వదేశం చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also.. Russia Ukraine War: రష్యా దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నాం.. మా ఫ్యామిలీ అంతా సేఫ్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్