Russia Ukraine War: షెహ్ని బోర్డర్‌లో ప్రత్యేక బస్సులు.. పోలాండ్ ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు..
'ఆపరేషన్ గంగ'లో భాగంగా భారతీయుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది ఇండియన్ ఎంబసీ. ఇప్పటికే ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను వదిలిపెట్టాలని కోరింది ఇండియన్ ఎంబసీ.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో(Russia Ukraine War) అక్కడ ఉన్న ‘ఆపరేషన్ గంగ’లో(Ganga Spice) భాగంగా భారతీయుల(Indian nationals) తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది ఇండియన్ ఎంబసీ. ఇప్పటికే ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను వదిలిపెట్టాలని కోరింది ఇండియన్ ఎంబసీ. మరోవైపు పోలాండ్ బోర్డర్ నుంచి భారతీయుల తరలింపును వేగవంతం చేసింది ఇండియన్ ఎంబసీ. కేంద్రమంత్రి వీకేసింగ్ దగ్గరుండి తరలింపు ఏర్పాట్లను చేస్తున్నారు. ఆపరేషన్ గంగలో భాగంగా గత నాలుగైదు రోజుల నుంచి అక్కడున్న భారతీయ విద్యార్థులతో పాటు మిగతా కార్మికులను కూడా భారత్‌కు తరలిస్తున్నారు. కేంద్రమంత్రి వీకేసింగ్ దీని కోసం ప్రత్యేకంగా పోలాండ్ ప్రధానితో సంప్రదింపులు జరిపారు. ఉక్రెయిన్ నుంచి పోలాండ్ బోర్డర్‌కు వస్తున్న భారతీయులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని కోరారు.
షెహ్ని బోర్డర్ దగ్గర భారతీయులను తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్‌లోని రైల్వేస్టేషన్ల నుంచి సరిహద్దు ప్రాంతాలకు తరలిరావాలని భారతీయ విద్యార్థులకు సూచిస్తున్నారు ఇండియన్ ఎంబసీ అధికారులు. ఫిబ్రవరి 24 నుంచే భారతీయుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు ఇండియన్ ఎంబసీ అధికారులు.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులతో.. హంగేరీ నుంచి బయలుదేరిన విమానం దిల్లీ చేరుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వారికి స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌లో ఉన్న ప్రతీ ఒక్క భారతీయుడిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
A flight carrying Indian nationals stranded in Ukraine arrives in Delhi from Hungary
Union Health Minister Dr. Mansukh Mandaviya receives the returnees, assures them that GoI is making every effort to rescue all Indians stranded in Ukraine pic.twitter.com/GIySpusKRI
— ANI (@ANI) March 1, 2022
ఇదిలావుంటే.. కీవ్ నగరమే లక్ష్యంగా దూసుకెళ్తున్న రష్యన్ సైన్యం ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద పట్టణమైన ఖార్కివ్‌పై దాడి చేసింది. ఆ నగరంలోని సెంట్రల్ స్క్వేర్ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ప్రభుత్వ కార్యాలయాలు సహా నివాసిత ప్రాంతాలు కూడా ధ్వంసమైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే ఈ దాడిలో ఎంతమంది స్థానికులు మృతిచెందారు అనే విషయంపై స్పష్టత లేదు. అంతకుముందు సోమవారం జరిగిన దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: Uric Acid Problem: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే.. సొరకాయ సూప్‌తో చెక్ పెట్టండి.. ఎలా తయారు చేయాలంటే..