విషాదం.. పడవ ప్రమాదంలో 14 మంది మృతి.. అదే కారణమని స్థానికుల ఆవేదన
ఝార్ఖండ్ జామ్తాడా జిల్లాలోని బరాకర్నది పడవ ప్రమాదంలో 14 మంది మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. మృతదేహాలను గుర్తించి, శవపరీక్ష నిర్వహించారు. అనంతరం వారి బంధువులకు అప్పగించారు....
ఝార్ఖండ్ జామ్తాడా జిల్లాలోని బరాకర్నది పడవ ప్రమాదంలో 14 మంది మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. మృతదేహాలను గుర్తించి, శవపరీక్ష నిర్వహించారు. అనంతరం వారి బంధువులకు అప్పగించారు. చేరింది. నిన్న ఎనిమిది మృతదేహాలు వెలికితీసిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు..ఇవాళ మరో ఆరు మృతదేహాలు కనుగొన్నారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మహిళలు ఉన్నారని జమ్తారా డిప్యూటీ కమిషనర్ ఫైజ్ అహ్మద్ ముంతాజ్ తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (CM Hemant Soren) ప్రకటించారు. ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 6 గంటలకు బరాకర్నదిలో జామ్తాడా నుంచి నిర్సాకు వెళ్తున్న బోటు ప్రమాదానికి గురైంది. బలమైన ఈదురు గాలులు, వర్షం, తుపాను ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
ఈ ఘటనలో పడవలో ఉన్న వారిలో నలుగురు ఎలాగోలా తమ ప్రాణాలు కాపాడుకోగా, 14 మంది నీటిలో పడిపోయారు. సమాచారం అందుకున్న పట్నా, రాంచీ ఎన్డీఆర్ఎఫ్బృందాలు గాలింపు చేపట్టారు. ఈ మేరకు నదిలో గల్లంతైన వారి మృత దేహాలను నేడు బయటకు తీశాయి. నదిపై బార్బెండియా బ్రిడ్జి (Barbendia bridge) పనిచేస్తే ప్రమాదాన్ని నివారించవచ్చని పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. వంతెన మరమ్మతు పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు నది దాటేందుకు నీటి మార్గంలో వెళ్తున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఇలాంటి ప్రమాదాలను నివారించాలని కోరారు.
Also Read
Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ అప్పుకు నివాళి.. పునీత్ రాజ్ కుమార్ పేరిట ఉపగ్రహం..
రాత్రి ఫ్రెండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో.. తెల్లారేసరికి రూమ్‌లో విగతజీవిగా యువతి.. అసలేం జరిగింది