Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి ఫ్రెండ్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌‌లో.. తెల్లారేసరికి రూమ్‌లో విగతజీవిగా యువతి.. అసలేం జరిగింది

Nursing student commits suicide: రాత్రి ఫ్రెండ్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో చాలా ఆనందంగా గడిపింది. తెల్లారేసరికి ఫ్యానుకు ఉరేసుకుని కనిపించింది. రాత్రికి రాత్రే ఏమైంది? ఆ గదిలో ఏం జరిగింది? ఆమె బలవన్మరణానికి కారణమెవరు

రాత్రి ఫ్రెండ్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌‌లో.. తెల్లారేసరికి రూమ్‌లో విగతజీవిగా యువతి.. అసలేం జరిగింది
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 01, 2022 | 11:21 AM

Nursing student commits suicide: రాత్రి ఫ్రెండ్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో చాలా ఆనందంగా గడిపింది. తెల్లారేసరికి ఫ్యానుకు ఉరేసుకుని కనిపించింది. రాత్రికి రాత్రే ఏమైంది? ఆ గదిలో ఏం జరిగింది? ఆమె బలవన్మరణానికి కారణమెవరు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీలోని శ్రీకాకుళం (Srikakulam) పట్టణంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. మజ్జి పావని అనే నర్సింగ్‌ విద్యార్థిని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఓ హాస్టల్‌లో ఫ్యానుకు ఉరేసుకోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. ఫిబ్రవరి 27వ తేదీ.. మంగళవారం రాత్రి ఆ రూమ్‌లోనే అంతా బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకున్నారు. రాత్రి 9లోపే అక్కడ పార్టీ వాతావరణం కనిపించింది. హాస్టల్‌ రూమ్‌లోనే ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపింది మజ్జి పావని. స్వయంగా ఫ్రెండ్‌కి కేక్‌ కొనిచ్చి.. కట్‌ చేయించి.. తినిపించింది. ఈ వేడుకల తర్వాత సీన్‌ మారిపోయింది. అంతా ఎవరి రూమ్‌కి వారు వెళ్లిన తర్వాత పావని.. గదిలోకి వెళ్లి తలుపులేసుకుంది. మజ్జి శ్రావణితోపాటు.. ఫ్రెండ్స్‌ అంతా ఓవైపు నర్సు కోర్సు చేస్తూనే పనిచేస్తున్నారు. దీంతో తన ఫ్రెండ్స్‌ నైట్‌షిప్టుకు వెళ్లిన సమయంలో రూమ్‌లో ఒంటరిగా ఉండిపోయింది. తెల్లారి వచ్చేసరికి పావని రూమ్‌ తలుపులు తెరవకపోవడంతో విషయం ఓనర్‌కి చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. తలుపులు బద్దలుకొట్టి తెరిచేసరికి పావని ఉరికి వేళాడుతూ కనిపించింది. ఈ దృశ్యం చూసిన తన ఫ్రెండ్స్‌ బోరున విలపించారు. రాత్రి ఎంతో ఉత్సాహంగా గడిపిన స్నేహితురాలు సూసైడ్‌ చేసుకోవడంతో షాకయ్యారు. ఆ రాత్రి ఏం జరిగింది. పావని ఎందుకు చనిపోయింది? పోలీసులు ప్రాథమిక వివరాలు సేకరించారు. కాని పావని ఎందుకు చనిపోయిందన్న విషయం ఇంకా తెలియలేదు. పావని ఉరేసుకున్న గదిలో సిలిండర్‌ ఓవైపు పడి ఉంది. సిలిండర్‌ ఎక్కి ఫ్యానుకు ఉరేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

పావనిది శ్రీకాకుళం జిల్లా రేగడి మండలం సిర్లాం గ్రామం. ఎన్నో ఆశలతో నర్సింగ్‌ చదువుకుంది. చదువతూనే కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేస్తోంది. భవిష్యత్‌పై ఎన్నో ఆశలపెట్టుకున్న పావని.. చిన్నవయసులోనే ఇలా చేసుకోవడం కుటుంబాన్ని కలచివేస్తోంది. పావని చనిపోయిందన్న వార్తతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.

మరోవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ చూస్తే.. పావనిది హత్య అనే అనుమానం కూడా లేకపోలేదు. క్లూస్‌ టీమ్‌తోపాటు స్నిఫర్‌ డాగ్స్‌ని రంగంలోకి దించారు. ఇది చూస్తుంటే పావని మృతికేసులో హత్య కోణాన్ని కూడా కొట్టిపారేయలేమంటున్నారు.

Also Read:

Crime News: ఆ విషయం చెప్పలేదని పెళ్లైన వారానికే పుట్టింటికి వెళ్లిన భార్య.. అవమానంతో భర్త..

AP News: ఎంతపనిచేశావమ్మ..? ఇద్దరు కుమార్తెలను చంపి.. వివాహిత ఏం చేసిందంటే..