Uric Acid Problem: శరీరంలో యూరిక్ యాసిడ్‌ పెరిగితే.. సొరకాయ సూప్‌తో చెక్ పెట్టండి.. ఎలా తయారు చేయాలంటే..

యూరిక్ యాసిడ్(Uric Acid Problem) రోగుల సంఖ్య దేశంలో నిరంతరం పెరుగుతోంది. మందులతో పాటు మీరు కొన్ని ఇంటి చిట్కాలను అనుసరించడం ద్వారా యూరిక్ యాసిడ్‌ను నియంత్రించవచ్చు.

Uric Acid Problem: శరీరంలో యూరిక్ యాసిడ్‌ పెరిగితే.. సొరకాయ సూప్‌తో చెక్ పెట్టండి.. ఎలా తయారు చేయాలంటే..
Lauki Soup Recipe
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 01, 2022 | 11:03 AM

యూరిక్ యాసిడ్(Uric Acid Problem) రోగుల సంఖ్య దేశంలో నిరంతరం పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం చెడు జీవనశైలి, ఆహార నియమాలు(Food Rules) లేక పోవడం. నిజానికి యూరిక్ యాసిడ్ అనేది శరీరంలోని ప్యూరిన్ అనే రసాయనం విడిపోయినప్పుడు శరీరంలో ఏర్పడే వ్యాధి. దీనితో పాటు, మూత్రపిండాలు ఫిల్టర్ చేసే సామర్థ్యాన్ని తగ్గించినప్పుడు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. అందువల్ల సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే మీరు అనేక వ్యాధుల బారిన పడవచ్చు. ఇటువంటి పరిస్థితిలో మందులతో పాటు మీరు కొన్ని ఇంటి చిట్కాలను అనుసరించడం ద్వారా యూరిక్ యాసిడ్‌ను నియంత్రించవచ్చు. ఈ ఇంటి వంటకంలో సొరకాయకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. సొరకాయతో సూప్ చేసుకుంటే వేగంగా ప్రయోజనం ఉంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణాన్ని సొరకాయ సూప్ ఎలా నియంత్రిస్తుంది. అలాగే దానిని తీసుకోవడం ఎలా..? అది ఎంత వరకు ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.

సొరకాయ సూప్  యూరిక్ యాసిడ్‌ను నియంత్రిస్తుంది

పొట్లకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, బి, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ఇది ఆరోగ్య పరంగా చాలా మంచిదని భావిస్తారు. పొట్లకాయ తేలికగా ఉంటుంది. దీని వల్ల కడుపులో భారంగా.. ఆకలి లేకపోవడం, కాలేయం, కిడ్నీ సంబంధిత సమస్యలలో దీని వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాకుండా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడాన్ని నియంత్రించడంలో సొరకాయకు బాగా సహాయపడుతుంది.

సొరకాయ సూప్ తయారు చేసే సులభమైన పద్ధతిని తెలుసుకోండి

  • సొరకాయ సూప్ తయారుచేయాలంటే ముందుగా సొరకాయను నీళ్లతో బాగా కడగాలి.
  • ఆ తర్వాత సొరకాయను చిన్న ముక్కులుగా కోయాలి
  • ఇప్పుడు కుక్కర్‌లో సొరకాయ ముక్కలు, కొంచెం నీరు, ఉప్పు వేయండి.
  • దీని తర్వాత కుక్కర్‌ని ఆఫ్ చేసి, 5-6 విజిల్‌ల వరకు విజిల్స్ వచ్చే వరకు చూడండి.
  • ఆ తర్వాత విజిల్ రాగానే సొరకాయ ముక్కలను మెత్తగా నూరుకోవాలి.
  • ఇప్పుడు పాన్‌లో ఒక చెంచా దేశీ నెయ్యి వేయాలి.
  • దీని తరువాత, దానికి అర టీస్పూన్ జీలకర్ర వేయండి.
  • ఆ తర్వాత వెంటనే అందులో ఉడికించి, మిక్సి పట్టిన సొరకాయ ముద్ద వేయాలి.
  • ఇప్పుడు రుచి ప్రకారం ఉప్పు వేసి సుమారు 2 నిమిషాలు ఉడికించాలి.
  • కావాలంటే, మీరు రుచి కోసం దీనిలో కొద్దిగా నల్ల మిరియాలు కూడా జోడించవచ్చు.
  • అంతే..మీ సొరకాయ సూప్ రెడీ.

గమనిక: దయచేసి వాటిని ఉపయోగించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి

ఇవి కూడా చదవండి: Russia Ukraine War: భారత ఫార్మా కంపెనీలను కమ్మేసిన యుద్ధ మేఘాలు..పెరగనున్న మందుల ధరలు.. 

Dera Baba: ముగిసిన సెలవులు.. భారీ భద్రత మధ్య మళ్లీ జైలుకెళ్లిన డేరాబాబా..