Calcium: మీరు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి..

ఈ మధ్య చాలా మంది మోకాళ్ల, కీళ్ల నొప్పులు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం శరీరంలో కాల్షియం తగినంత లేకపోవడమే.

Calcium: మీరు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి..
Bone
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 01, 2022 | 2:40 PM

ఈ మధ్య చాలా మంది మోకాళ్ల, కీళ్ల నొప్పులు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం శరీరంలో కాల్షియం(Calcium) తగినంత లేకపోవడమే. కాల్షియం ఎముకల(Bones)కే కాకుండా కండరాలు, నాడీ వ్యవస్థ(Nervous system) సరిగా పని చేయడానికి ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఉండే 90 శాతం కాల్షియం మన శరీరంలో ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతుంది. 10 శాతం కాల్షియం మన శరీరంలో ఉండే రక్తాన్ని గడ్డ కట్టకుండా ఉండడానికి, కండరాలు, నరాల పనితీరు మెరుగుపర్చడానికి ఉపయోగించబడుతుంది. ఇది హృదయ స్పందన క్రమబద్ధీకరణకు దోహదం చేస్తుంది. 19 నుంచి 64 సంవత్సరాల వయస్సు ఉన్న పెద్దలకు రోజుకు 700 mg కాల్షియం అవసరం అయితే ఎలాంటి ఆహారాల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందో చూద్దాం.. పాలు, జున్ను, ఇతర పాల ఆహారాలు, నువ్వులు,నారింజ , బాదం ,వైట్ బీన్స్, గుడ్డు, సోయాబీన్, ఆకుపచ్చ కూరగాయలలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది

ఆకుపచ్చ కూరగాయలు

ఆకుపచ్చ కూరగాయలలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. బచ్చలి కూర, పుదీనా, అరటి, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలలో ఇనుముతో పాటు కాల్షియం కూడా ఉంటుంది

చిక్కుళ్లు

బీన్స్ పప్పు ధాన్యలులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే వీటిలో కాలుష్యంతో పాటు ప్రోటీన్, ఐరన్, జింక్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం, ఫైబర్ ఉంటుంది.

కూరగాయలు

ఈ క్యాబేజీ. సోయాబీన్స్, క్యారెట్ వంటి కూరగాయలలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. వాటిని మీ ఆహారంలో కనీసం వారానికి ఒక్కసారైనా తింటే కాల్షియం లభిస్తుంది.

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందువల్ల వైద్యులు కూడా వీటిని తినమని సిఫార్సు చేస్తారు. వీటిలో చాలా పోషకమైన విటమిన్లు కలిగి ఉంటాయి. అలాగే వీటిలో క్యాల్షియం కూడా అధిక మొత్తంలో కలిగి ఉంటుంది.

ఆరెంజ్

ఆరెంజ్, కమలలో పోషకమైన మూలకాలతో నిండి ఉంటాయి. ఇందులో విటమిన్-సి అలాగే కాల్షియం ఉంటుంది. ఒక కప్పు (200 గ్రాములు) ఒలిచిన నారింజ, కమలలో 72.2 మి.గ్రా కాల్షియం ఉంటుంది.

పాలు

ఒక కప్పు పాలలో సుమారు 276 ఎంజి కాల్షియం లభిస్తుంది. మీరు పాలతో చేసిన ప్రతి ఒక్క పదార్థంలో జున్ను పెరుగు వెన్న వంటి పదార్థంలో ఎక్కువ మోతాదులో క్యాల్షియం లభిస్తుంది.

గమనిక: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.

Read Also..  Hair Dyes: జుట్టుకు కలర్ వేస్తున్నారా.. అయితే మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లే.. ఎందుకంటే..