Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు శివరాత్రి కానుక.. మాస్ కిక్కు ఇస్తోన్న మహేశ్ కొత్త పోస్టర్..
Mahesh Babu: సరిలేరు నీకెవ్వరు లాంటి హిట్ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న ప్రిన్స్ మహేశ్ బాబు ఇప్పుడు సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) పాడేందుకు సిద్ధమవుతున్నారు.
Mahesh Babu: సరిలేరు నీకెవ్వరు లాంటి హిట్ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న ప్రిన్స్ మహేశ్ బాబు ఇప్పుడు సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) పాడేందుకు సిద్ధమవుతున్నారు. మహానటి కీర్తి సురేశ్(Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తోంది. గీత గోవిందం ఫేం పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్ సంయుక్తంగా ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రేమికుల రోజు విడుదలైన ‘కళావతి’ సింగ్ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. యూట్యూబ్ రికార్డులను కొల్లగొడుతూ రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటోంది. కాగా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహేశ్ బాబు అభిమానులకు అదిరిపోయే కానుకను అందించింది సర్కారువారి పాట చిత్ర బృందం. ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది.
ఈ కొత్త పోస్టర్‌లో మహేశ్ రౌడీలను కొడుతుంటే.. వాళ్లు గాల్లో ఎగిరిపడుతున్నారు. ప్రత్యర్థుల భరతం పడుతున్న ఈ ఫైటింగ్ పోస్టర్‌ను చూసి మహేశ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్లే ఈ సినిమాలో కూడా యాక్షన్ డోస్ ఎక్కువగానే ఉందని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ‘సర్కారు వారి పాట’లో సీనియర్ నటుడు సముద్రఖని, వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.థమన్ బాణీలు సమకూరుస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను చూసుకుంటున్నారు. కాగా ఈ చిత్రాన్ని మే 12న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Wishing you all a happy #MahaShivaratri! May the ever benevolent Lord Shiva bring strength and abundance! Let good conquer all evil! ? pic.twitter.com/PnNeo5HbHE
— Mahesh Babu (@urstrulyMahesh) March 1, 2022
Also Read:గోడకి ఫిట్ చేసుకునే కూలర్ గురించి విన్నారా.. తక్కువ ఖర్చుతో ఏసీలాంటి చల్లదనం..!
విషాదం.. పడవ ప్రమాదంలో 14 మంది మృతి.. అదే కారణమని స్థానికుల ఆవేదన
Russia Ukraine War: షెహ్ని బోర్డర్‌లో ప్రత్యేక బస్సులు.. పోలాండ్ ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు..