ఆస్తి తన పేరున రాయాలని.. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి

ఎన్నో కలలతో భర్తతో కలిసి అత్తారింట్లో అడుగు పెట్టిన ఆ యువతికి కష్టాలు స్వాగతం పలికాయి. ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన భర్తే.. ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. పెళ్లి సమయంలో అరకిలో బంగారం, 15 కేజీల వెండి, ఇతర విలువైన వస్తువులను కట్నంగా ముట్టజెప్పినా.....

ఆస్తి తన పేరున రాయాలని.. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి
Harassment
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 01, 2022 | 5:46 PM

ఎన్నో కలలతో భర్తతో కలిసి అత్తారింట్లో అడుగు పెట్టిన ఆ యువతికి కష్టాలు స్వాగతం పలికాయి. ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన భర్తే.. ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. పెళ్లి సమయంలో అరకిలో బంగారం, 15 కేజీల వెండి, ఇతర విలువైన వస్తువులను కట్నంగా ముట్టజెప్పినా.. అతను వక్రబుద్ధి మార్చుకోలేదు. ఇంకా అదనపు కట్నం కావాలని భార్యను వేధించడం(Harassment) ప్రారంభించాడు. అతని వేధింపులు తాళలేక తల్లిదండ్రులకు చెప్పింది. పరువు పోతుందని భావించిన వారు అడిగినంత అదనపు కట్నం(Additional Dowry) అప్పగించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. ఆస్తి తన పేరున రాయాలని భార్యను వేధిస్తూ ఆమెతో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీశాడు. ఆస్తి రాయకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అతని వేధింపులు తాళలేని బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కర్ణాటక(karnataka)లోని హనుమంతనగర ప్రాంతంలో ప్రగత్ పురుషోత్తమ్ అనే వ్యక్తి నివాసముండేవాడు. అతనికి ఏడేళ్ల క్రితం లక్కసంద్రకు చెందిన యువతిలో వివాహమైంది. పెళ్లి సమయంలో యువతి తరఫు బంధువులు అర కేజీ బంగారం, 15 కిలోల వెండి ఆభరణాలు ఇచ్చారు.

కొత్తలో వీరి కాపురం అన్యోన్యంగా సాగింది. కొన్నాళ్లకు దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. అవి క్రమంగా పెద్దగా మారి ఇరువురు ఘర్షణకు దిగే స్థాయికి చేరాయి. ప్రగత్ పురుషోత్తమ్ తనకు ఇంకా అదనపు కట్నం కావాలని, తీసుకురావాలని భార్యను నిత్యం వేధించేవాడు. భర్త వేధింపులు తాళలేక బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన వారు.. రూ.40లక్షలు అదనంగా ఇచ్చాచరు. అయినా ప్రగత్ లో మార్పు రాలేదు. నిత్యం మద్యం తాగి భార్యను వేధించేవాడు.

ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా వీడియోలు తీశాడు. వాటిని చూపిస్తూ.. బెదిరింపులకు దిగాడు. ఆస్తి తన పేరున రాయాలని, లేకుండే ఈ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు.. భర్త ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Also Read

Maha Shivaratri: హర హర మహాదేవ శంభో శంకర.. శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు..

Amritha aiyer: స్టైలిష్ లుక్ తో కుర్రకారును కట్టిపడేస్తున్న అమృత.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్…

Actor Sunil: హీరోగా రెండు సినిమాలను అనౌన్స్ చేసిన సునీల్.. ఈసారి పోలీస్ పాత్రలో మరింత పవర్‌ఫుల్‌ గా..