Russia President Putin: 31 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు.. తనకంటే 30 ఏళ్ల చిన్నదానితో డేటింగ్‌.. పుతిన్‌ వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర విషయాలివే..

Russia Ukraine Crisis: ప్రస్తుతం ప్రపంచమంతా పఠిస్తోన్న పేరు ఏదైనా ఉందంటే..అది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) దే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Russia President Putin: 31 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు.. తనకంటే 30 ఏళ్ల చిన్నదానితో డేటింగ్‌.. పుతిన్‌ వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర విషయాలివే..
Vladimir Putin
Follow us

|

Updated on: Mar 01, 2022 | 8:21 PM

Russia Ukraine Crisis: ప్రస్తుతం ప్రపంచమంతా పఠిస్తోన్న పేరు ఏదైనా ఉందంటే..అది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) దే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. అమెరికా, బ్రిటన్‌ లాంటి అగ్రరాజ్యాలన్నీ వ్యతిరేకంగా ఉన్నా ఉక్రెయిన్ (Ukraine) తో యుద్ధానికి సై అంటై సై అంటున్నారాయన. ఆంక్షలు, నిబంధనలు విధిస్తున్నా, నియంత అని విమర్శిస్తున్నా ‘డోన్ట్‌ కేర్‌’ అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన వ్యక్తులలో ఒకరిగా గుర్తింపు పొందుతున్నారు పుతిన్‌. ప్రభుత్వ పాలనలోనే కాకుండా అన్ని అంశాల్లోనూ కఠినంగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని ఆయనకు పేరుంది. మరి ప్రపంచాన్ని ఎదిరిస్తూ ముందుకు వెళుతోన్న పుతిన్‌ వ్యక్తిగత జీవితమేంటి? ఆయన లైఫ్‌స్టైల్‌ ఎలా ఉంటుంది? ఆస్తులెన్ని ఉన్నాయి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి.

రోజును ఇలా ప్రారంభిస్తారు..

సాధారణంగా గొప్ప గొప్పవాళ్లందరూ సూర్యుడు రాకముందే నిద్ర లేస్తారంటారు. అయితే పుతిన్‌ మాత్రం ఉదయం ఆలస్యంగా మేల్కొంటారట. అంతేకాదు ఉదయానికి బదులు మధ్యాహ్నమే బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటారు. ఇక అతని పని గురించి చెప్పుకుంటే పోతే తీరిగ్గా సాయంత్రం పనులు మొదలు పెడతారట. అలా రాత్రివరకు పనిచేస్తూనే ఉంటారట. ప్రస్తుతం పుతిన్‌ వయసు 69 ఏళ్లు. అయినప్పటికీ ఆయన ఇంకా ఫిట్‌గా కనిపిస్తున్నారంటే ఆయన పాటించే ఫిట్‌నెస్‌ సూత్రాలే కారణం. క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్తాడు. పుతిన్‌కు స్విమ్మింగ్‌ చేయడమంటే ఎంతో ఇష్టం. రోజుకు సుమారు 2 గంటల పాటు స్విమ్మింగ్ చేస్తారట. ఇక జూడోలో ఆయనకు బ్లాక్ బెల్ట్ ఉంది. అంతేకాకుండా జంతువులను వేటాడడాన్ని బాగా ఇష్టపడతాడు. క్రమం తప్పకుండా రోజూ అడవికి వేటకు వెళ్తుంటారట.

వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా..

పాలనా వ్యవహరాల్లో ఎంతో నిక్కచ్చిగా ఉండే పుతిన్‌ తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రం చాలా రహస్యంగా ఉంచుతారట. అందుకే ఆయన సతీమణి, ఇతర కుటుంబీకుల గురించి ఎక్కడా పెద్దగా సమాచారం దొరకదు. అయితే ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం ప్రకారం 1993లో అతను వృత్తిరీత్యా విమాన సహాయకురాలు లియుడ్మిలా ష్క్రెబెనెవాను వివాహం చేసుకున్నాడు.1985 నుండి 1990 వరకు వీరు తూర్పు జర్మనీలో నివాసమున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు మరియా, యెకాటెరినా ఉన్నారు. అయితే ఈ 31 ఏళ్ల వివాహ బంధం 2014లో తెగిపోయింది. కాగా వివాహ బంధం విచ్ఛిన్నమైన తర్వాత పుతిన్‌ ప్రముఖ ఒలింపిక్‌ జిమ్నాస్ట్‌ అలీనా కబేవాతో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీరిద్దరి బంధంపై ఎక్కడా అధికారిక సమాచారం లేదు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అలీనా పుతిన్‌ కంటే 30 ఏళ్లు చిన్నది. ఇక పుతిన్‌ తన భార్యతో విడాకులు తీసుకోవడానికి అలీనానే ప్రధాన కారణమని అక్కడి ప్రజలు భావిస్తారు. అలీనాకు మొత్తం ముగ్గురు సంతానమున్నారు. అలీనానే కాకుండా మల్టీ మిలియనీర్ స్వెత్లానా క్రివోనోగిఖ్‌తోనూ పుతిన్‌కు వివాహేతర సంబంధం ఉందని, వీరికి ఒక కూతురు కూడా జన్మించిదని అక్కడి నివేదికలు చెబుతున్నాయి.

విదేశాల్లో విలాసవంతమైన భవనాలు..

ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు 50కు పైగా విమానాలు ఉన్నాయట. అతనికి విమానాలను నడపడం అంటే ఇష్టం. కొన్నేళ్ల క్రితం రష్యా అడవుల్లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు పుతిన్ స్వయంగా విమానాన్ని నడిపి అక్కడకు చేరుకున్నాడు. ప్రజలను రక్షించారు. అతనికి రేసింగ్ కార్లు, సబ్ మెరైన్స్ కూడా నడిపిన అనుభవం ఉంది. రష్యన్‌ మీడియా నివేదికల ప్రకారం, 2012 నాటికి పుతిన్‌కు 20 విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయట. రష్యాతో పాటు మాస్కో, ఫిన్లాండ్ ఇతర దేశాల్లో కూడా లగ్జరీ ఫ్లాట్లు ఉన్నాయట. కొన్నేళ్ల క్రితం పుతిన్ సౌత్ ఈస్టేర్న్ ఐరోపాలోని నల్ల సముద్ర తీరంలో విలాసవంతమైన ఇల్లు కారణంగా వార్తల్లో నిలిచారు. అప్పట్లో దీని ధర 950 మిలియన్ డాలర్లు అంటే ఇండియాలో సుమారు 95కోట్లు. ఇక పుతిన్ ఆస్తులు సుమారు 200 బిలియ‌న్ల డాల‌ర్లకు పైగా ఉంటాయని అమెరికా ఫైనాన్షియ‌ర్ బ్రిల్ బ్రౌడ‌ర్ చెబుతారు. అదేవిధంగా రష్యా అధినేత ఆస్తులు సుమారు 125 బిలియ‌న్ల డాల‌ర్ల వరకు ఉంటాయని జార్జిటౌన్ వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ ఆండ‌ర్స్ అస్లాండ్ తను రాసిన ఓ పుస్తకంలో తెలిపారు. మిత్రులు, బంధువుల పేరిట విదేశాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది.

Also Read:దక్షిణాఫ్రికాలో జీరో(సున్నా) కొవిడ్ మరణాలు.. మే 2020 తర్వాత ఇదే ప్రథమం

UP Elections 2022: ఆరో దశ ఎన్నికల్లో నేర చరిత్ర నాయకులు అధికమే.. కోటీశ్వరులు ఎక్కువే.. వివరాలివే

Russia – Ukraine Crisis: ప్రాణాలు పోయినా సరే రష్యాకు లొంగేది లేదు.. సంచలన ప్రతిజ్ఞ చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు..

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..