దక్షిణాఫ్రికాలో జీరో(సున్నా) కొవిడ్ మరణాలు.. మే 2020 తర్వాత ఇదే ప్రథమం

గత రెండు రోజులుగా దక్షిణాఫ్రికాలో జీరో(సున్నా) కరోనా మరణాలు(Corona deaths) నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్యశాఖ(Health Department) అధికారులు తెలిపారు. మే 2020 తర్వాత అలాంటి పరిస్థితి రావడం ఇదే..

దక్షిణాఫ్రికాలో జీరో(సున్నా) కొవిడ్ మరణాలు.. మే 2020 తర్వాత ఇదే ప్రథమం
Corona South Africa
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 01, 2022 | 8:15 PM

గత రెండు రోజులుగా దక్షిణాఫ్రికాలో జీరో(సున్నా) కరోనా మరణాలు(Corona deaths) నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్యశాఖ(Health Department) అధికారులు తెలిపారు. మే 2020 తర్వాత అలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి అని ఆనందం వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖ అధికారుల అప్రమత్తత, వైద్యుల సహకారంతో తాము ఈ లక్ష్యాన్ని చేరుకోగలిగామని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీసెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో కరోనా కేసులు తగ్గి ఆసుపత్రులు ఖాళీగా ఉన్నాయని విట్వాటర్‌రాండ్ విశ్వవిద్యాలయ వ్యాక్సినాలజీ ప్రొఫెసర్ షబీర్ మధి అన్నారు. టీకాల లభ్యత, అధికారుల ముందస్తు చర్యలు, ప్రజల సహకారంతో దేశంలో కరోనా మరణాలు తగ్గుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యధిక జనసాంద్రత కలిగిన గౌటెంగ్ ప్రావిన్స్‌లో 80% మంది ఇప్పటికే కొవిడ్ బారిన పడ్డారని, ఈ లెక్కలు మొత్తం దేశానికి అద్దం పడుతోందని అన్నారు. జింబాబ్వే, నమీబియా, అంగోలా, మొజాంబిక్ వంటి దేశాలు కూడా గత 24 గంటల్లో కొవిడ్ మరణాలను నివేదించలేదు.

గతంలో దక్షిణాఫ్రికాలో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ బయటపడటం ఆందోళన రేకెత్తించింది. దానిని ‘బి.1.1.529’గా గుర్తించారు. ఈ వేరియంట్‌ ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతున్నట్లు దక్షిణాఫ్రికా వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నాలుగో ఉద్ధృతి (వేవ్‌) డిసెంబరు లేదా జనవరిలో వస్తుందని అంచనా వేశామని.. అయితే కొత్త వేరియంట్‌ కేసులు తాజాగా బయటపడుతున్నాయని ఆ శాఖ మంత్రి జో ఫాహ్లా తెలిపారు. కొత్త కేసులు, పాజిటివిటీ రేటు కూడా పెరుగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త వేరియంట్‌ను బోట్స్‌వానా, హాంకాంగ్‌ల్లోనూ కనుగొన్నారు. దీనిపై ఇంపీరియల్‌ కాలేజి లండన్‌ వైరాలజిస్ట్‌ డాక్టర్‌ టామ్‌ పీకాక్‌ బ్రిటన్‌ను అప్రమత్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా అధిక సంఖ్యలో ఈ వేరియంట్‌కు కొమ్ము భాగంలో ఉత్తరివర్తనాలు (మ్యుటేషన్లు) ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. విస్తృతంగా వ్యాప్తి చెందడం, రోగనిరోధక శక్తిని ఏమార్చడం వంటి కోణాల్లో ఈ రకం తీరుతెన్నులపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు.

Also Read

Maha Shivratri 2022: సద్గురుతో మహాశివరాత్రి.. శివ నామస్మరణతో భక్తులు పారవశ్యం..(Video)

Zodiac Sign: ఈ 4 రాశులవారు పెద్ద పిసినారులు.. కానీ ఈ విషయంలో మాత్రం ఫస్ట్..!

Ramarao on Duty: మాస్‌ మహరాజా ఫ్యాన్స్‌కు మహాశివరాత్రి సర్‌ప్రైజ్‌.. అలరిస్తోన్న రామారావు యాక్షన్‌ టీజర్‌..