Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇదెక్కడి సినిమా రా బాబూ.. భర్త కోసం అమ్మాయిని సెట్ చేసే భార్య.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..

ప్రస్తుతం ఓటీటీ సినీప్రపంచంలో హారర్, మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఇప్పుడు అలాంటి జానర్ చిత్రాలను రూపొందించేందుకు మేకర్స్ ముందుకు వస్తున్నారు. అలాగే ఇటు ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన చిత్రాలను అందుబాటులోకి తెస్తున్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్.

OTT Movie: ఇదెక్కడి సినిమా రా బాబూ.. భర్త కోసం అమ్మాయిని సెట్ చేసే భార్య.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..
Basant Ese Geche Ott
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 06, 2025 | 8:57 AM

ప్రస్తుతం ఓటీటీలో రొమాంటిక్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చిన సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. అటు కంటెంట్ లో కొత్తదనంతోపాటు భావోద్వేగాలు, జీవితం పరంగా ప్రేక్షకులను కదిలించే కథలతో వచ్చిన సినిమాలను అడియన్స్ ఆదరిస్తున్నారు. అలాగే రియాల్టీకి దగ్గరగా ఉండే సినిమాలను రూపొందిస్తూ సక్సెస్ అవుతున్నారు దర్శకనిర్మాతలు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ భాషలలో విడుదలైన సినిమాలు ఇప్పుడు ఓటీటీలో భారీ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ప్రస్తుతం ఓ బెంగాలీ సినిమా సైతం ఓటీటీలో దూసుకుపోతుంది. అదే బసంత్ ఎసే గెచే. 2024లో విడుదలైన ఈ సినిమాకు అభిమన్యు ముఖర్జీ దర్శకత్వం వహించారు.

ప్రేమ, అపార్థాలు, భావోద్వేగాల నేపథ్యంలో ముగ్గురు వ్యకుల జీవితాల్లో వచ్చే మలుపులను చిత్రీకరిస్తూ ఈ సినిమాను రూపొందించారు. ఇందులో దత్తా, అర్పన్ ఘోషాల్, సాక్షి సాహా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ముగ్గురి మధ్య సాగే కథే ఈ మూవీ. ఊహించని ట్విస్టులు, మెంటలెక్కించే సీన్లతో ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీ Adda Times ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక టీజర్ స్టూడెంట్ మధ్య ప్రేమ అనే స్పర్శకు కొత్త కోణాన్ని ఇస్తూ.. భావోద్వేగాలకు దారితీసే కథతో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ అందుకుంటుంది.

కథ విషయానికి వస్తే.. చంద్రిమా (దత్తా), నిషాన్ (అర్పన్ ఘోషాల్) ఇద్దరు భార్య భర్తలు. ఇంజినీరింగ్ స్టూడెంట్ తియాషా (సాక్షి సాహా) తన లెక్కల టీచర్ నిషాన్ ప్రేమలో పడుతుంది. తన ప్రేమను లవ్ లెటర్ రూపంలో తెలియజేస్తుంది. కానీ నిషాన్ ఆ లెటర్ పట్టించుకోకుండా దానిని తన భార్యకు చూపిస్తాడు. దీంతో చంద్రిమా ఈ ఎంటైర్ లవ్ డ్రామాను ఆటగా తీసుకుంటూ తియాషాతో చాటింగ్ చేస్తుంది. దీంతో నిషాన్ తనను ప్రేమిస్తున్నాడనే భ్రమలో ఉండిపోతుంది తియాషా. ఆ తర్వాత నిజం తెలుసుకోని తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటుంది. చివరకు అతడిని జైలుకు పంపిస్తుంది. ఆ తర్వాత ముగ్గురి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది సినిమా.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..