Balakrishna: ‘మీ నాన్న సినిమా కంటే ముందు నా మూవీ చూడు’.. లైవ్‌లోనే రామ్ చరణ్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం బాలయ్యతో కలిసి అల్లరి చేశారు. కేవలం డార్లింగ్ మాత్రమే కాదు.. మ్యాచో స్టార్ గోపిచంద్ సైతం అన్ స్టాపబుల్ సీజన్ 2లో పాల్గొన్నారు. . వీరికి సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్
ఇప్పటివరకు హీరోగా అభిమానులను అలరించిన నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఇప్పుడు యాంకరింగ్‌లో సరికొత్త ట్రెండ్ తీసుకువచ్చారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 విజయవంతంగా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే ఈ షో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అదేవిధంగ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా అతిథులను తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అడివి శేష్, శర్వానంద్, విశ్వక్ సేన్, సిద్దూ జొన్నలగడ్డ సందడి చేయగా… పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం బాలయ్యతో కలిసి అల్లరి చేశారు. కేవలం డార్లింగ్ మాత్రమే కాదు.. మ్యాచో స్టార్ గోపిచంద్ సైతం అన్ స్టాపబుల్ సీజన్ 2లో పాల్గొన్నారు. . వీరికి సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమింగ్ కానుండగా.. ఇప్పటివరకు విడుదలైన ప్రోమోస్ సెన్సెషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న విడుదలైన మరో ప్రోమో కూడా ఆకట్టుకుంది.
ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రభాస్ అల్లరి.. గోపిచంద్, బాలయ్య కలిసి డార్లింగ్ ను టీజ్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో షో మధ్యలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కాల్ చేసి ప్రభాస్ సీక్రెట్స్ తెలుసుకునే ప్రయత్నం చేశారు బాలకృష్ణ. ఈ క్రమంలోనే చెర్రీకి స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ముందుగా ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న వీరసింహా రెడ్డి సినిమాను చూడాలని.. ఆ తర్వాతే మీ నాన్నగారి వాల్తేరు వీరయ్య సినిమా చూడాలంటూ సరదాగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరలవుతుంది.
డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటించిన వీరసింహ రెడ్డి సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 12న విడుదల కానుంది. ఇందులో బాలయ్య సరసన శ్రుతి హాసన్ నటించగా.. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో బాలయ్య ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.