Vadhuvu OTT: అవికా గోర్ మరో హార్రర్ థ్రిల్లర్ సిరీస్.. వధువు టీజర్ చూశారా?.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా ప్రేమ కథ చిత్రాలు, ఫ్యామిలీ స్టోరీస్‌లోనే ఎక్కువగా నటించింది చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్. అయితే ఇప్పుడుహార్రర్ అండ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీసుల్లోనే ఎక్కువగా కనిపిస్తోందీ అందాల తార. 1920, హార్రర్స్ ఆఫ్ ది హార్ట్, అలాగే ఇటీవలే రిలీజైన మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్ ఈ జోనర్‌కు సంబంధించినవే.
కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా ప్రేమ కథ చిత్రాలు, ఫ్యామిలీ స్టోరీస్‌లోనే ఎక్కువగా నటించింది చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్. అయితే ఇప్పుడుహార్రర్ అండ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీసుల్లోనే ఎక్కువగా కనిపిస్తోందీ అందాల తార. 1920, హార్రర్స్ ఆఫ్ ది హార్ట్, అలాగే ఇటీవలే రిలీజైన మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్ ఈ జోనర్‌కు సంబంధించినవే. వీటిలో అవిక అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సిరీస్‌తో మన ముందుకు రానుందీ బ్యూటీఫుల్ హీరోయిన్. వధువు పేరుతో తెరకెక్కుతోన్నఈ వెబ్ సిరీస్‍కు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. చూస్తుంటే ఇది కూడా థ్రిల్లర్ హార్రర్ జోనర్‌కు చెందినదేనని క్లియర్‌గా అర్థమవుతోంది. పెళ్లి చేసుకొని ఓ ఇంట్లో అడుగు పెడుతుంది అవికా గోర్. అయితే ఆ ఇంట్లో విచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. ఈ ఇంట్లోని విషయాలు కోడలికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అనే డైలాగ్, . అలాగే మిస్టీరియస్ ఫ్యామిలీ అనే వాయిస్ ఓవర్ వధువు వెబ్ సిరీస్‌పై ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న వధువు వెబ్ సిరీస్ డిస్నీప్లస్ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్‍కు రానుంది. హాట్‍స్టార్‌లో రిమైండ్ మీ ఆప్షన్ ద్వారా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ వివరాలు తెలిశాయి. అయితే రిలీజ్‌పై ఇంకా అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
కాగా బెంగాలీ హార్రర్ అండ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ హోయ్‍చాయ్‍కు రీమేక్‍గా వధువు వెబ్ సిరీస్ రూపొందుతోందని తెలుస్తోంది. ఇందులో బిగ్‍బాస్ ఫేమ్ అలీ రెజా, నందు కూడా ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఎస్‍వీఎఫ్ పతాకంపై అభిషేక్ దాగా ఈ సిరీస్‍ను నిర్మిస్తున్నారు. త్వరలోనే వధువు వెబ్ సిరీస్‌కు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. అక్కినేని నాగచైతన్య థ్యాంక్యూ సినిమాలో ఓ కీ రోల్ పోషించింది అవికా గోర్. ప్రస్తుతం తెలుగులో ఉమాపతి అనే ఓ సినిమాలో నటిస్తోంది.
వధువు సిరీస్ టీజర్..
Secrets, lies, and dark superstitions! Indu’s story unveils soon 👀#VadhuvuonHotstar coming soon only on #DisneyPlusHotstar@avika_n_joy @ActorAliReza @ActorNandu @iammony @shrikantmohta @abhishekdagaa @SVFsocial @NambuShalini pic.twitter.com/g1XFNGtP0g
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 14, 2023
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..
A marriage full of secrets. Get ready for Indu’s story soon‼️#VadhuvuonHotstar coming soon only on @disneyplushstel@avika_n_joy @ActorAliReza @ActorNandu @iammony @shrikantmohta @abhishekdagaa @SVFsocial pic.twitter.com/ueME3e63Nj
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 10, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..