Vadhuvu OTT: మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లో అవికా గోర్.. వధువు స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
చిన్నారి పెళ్లి కూతురిగా తెలుగు ప్రేక్షకుల అభిమానాలు చూరగొంది అవికా గోర్. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావా, తను నేను, ఎక్కడికి పోతావు చిన్న వాడా, రాజు గారి గది 3, టెన్త్ క్లాస్ డైరీస్, థ్యాంక్యూ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అయితే ఈ మధ్యన సిల్వర్ స్ర్రీన్‌పై కంటే ఎక్కువగా ఓటీటీల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది

చిన్నారి పెళ్లి కూతురిగా తెలుగు ప్రేక్షకుల అభిమానాలు చూరగొంది అవికా గోర్. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావా, తను నేను, ఎక్కడికి పోతావు చిన్న వాడా, రాజు గారి గది 3, టెన్త్ క్లాస్ డైరీస్, థ్యాంక్యూ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అయితే ఈ మధ్యన సిల్వర్ స్ర్రీన్‌పై కంటే ఎక్కువగా ఓటీటీల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. హార్రర్ అండ్ థ్రిల్లర్ సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లోనూ సందడి చేస్తోంది. ఇటీవలే మ్యాన్షన్ 24 అనే వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను మెప్పించిన అవిక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సిరీస్‌తో మన ముందుకు రానుంది. వధువు పేరుతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‍కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో పెళ్లి దుస్తులు, నుదుట బాసికంతో కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించిందీ అందాల తార. ‘మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్.. గెట్ రెడీ ఫర్ ఇందూస్ స్టోరీ సూన్’ అంటూ ఈ వెబ్ సిరీస్‌కు క్యాప్షన్ పెట్టారు మేకర్స్. ఈ వెబ్ సిరీస్‍లో బిగ్‍బాస్ ఫేమ్ అలీ రెజా, నందు కూడా ప్రధాన పాత్రలు చేస్తున్నారు. చూస్తుంటే మ్యాన్షన్ 24 సిరీస్ లాగే వధువు కూడా థ్రిల్లర్ జోనర్‌కే చెందుతుందని తెలుస్తోంది.
ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న వధువు వెబ్ సిరీస్ త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. వధువు వెబ్ సిరీస్‍ను ఎస్‍వీఎఫ్ సోషల్ పతాకంపై అభిషేక్ దాగా నిర్మిస్తున్నారు. కాగా పాప్ కార్న్ అనే తెలుగు సినిమాలో చివరిగా కనిపించింది అవికా గోర్. అలాగే నాగచైతన్య థ్యాంక్యూ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా క్లిక్ కాలేదు. దీంతో ఇప్పుడు ఎక్కువగా ఓటీటీ సినిమాలు, సిరీసుల్లోనే ఎక్కువగా నటిస్తోంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనే స్ట్రీమింగ్..
A marriage full of secrets. Get ready for Indu’s story soon‼️#VadhuvuonHotstar coming soon only on @disneyplushstel@avika_n_joy @ActorAliReza @ActorNandu @iammony @shrikantmohta @abhishekdagaa @SVFsocial pic.twitter.com/ueME3e63Nj
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 10, 2023
అవికా గోర్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








