Clap Trailer: ‘మనం జీవితంలో ఓడిపోయేది అప్పుడే’.! ఆసక్తికరంగా క్లాప్ ట్రైలర్. ఛాలెంజింగ్ రోల్‌లో ఆది పినిశెట్టి.
Clap Trailer: ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్ జంటగా తెరకెక్కిన సినిమా 'క్లాప్'. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ (OTT) సంస్థ సోనీలివ్ (Sony LIV)లో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంతో విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగం పెంచిన చిత్ర యూనిట్ తాజాగా సినిమా ట్రైలర్‌ను..
Clap Trailer: ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్ జంటగా తెరకెక్కిన సినిమా ‘క్లాప్’. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ (OTT) సంస్థ సోనీలివ్ (Sony LIV)లో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంతో విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగం పెంచిన చిత్ర యూనిట్ తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇందులో ఆది రన్నర్‌గా కనిపించనున్నాడు. ప్రమాదంలో కాలు కోల్పోయిన వ్యక్తిగా ఆది నటన అద్భుతంగా ఉంది. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు.
ఇక 2.34 నిమిషాల నిడివి ఉన్న సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఈ సినిమాలో స్పోర్ట్స్‌లో ఉండే పాలిటిక్స్‌ను దర్శకుడు టచ్ చేసినట్లు కనిపిస్తోంది. భాగ్యలక్ష్మీ అనే పేద యువతిని అథ్లేట్‌గా చేయడానికి ఆది కష్టపడుతుంటే కొందరు పెద్దలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంతకీ భాగ్యలక్ష్మీని అథ్లేట్‌గా కాకుండా వారు ఎందుకు అడ్డుకుంటున్నారు.? చివరికి ఆది అనుకున్నది సాధించాడా.? సాధించే క్రమంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోన్నాడు లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇప్పటి వరకు పలు వినూత్న పాత్రలను పోషించిన ఆదికి ఈ సినిమా మరో మైలు రాయిగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ సినిమాతో ఆది ఎలాంటి పాపులారిటీని సొంతం చేసుకుంటాడో చూడాలి.
Eyesight: చిన్న వయసులోనే కళ్లు దెబ్బతినడానికి కారణం ఏంటో తెలుసా..!