Bigg Boss Non Stop Buzz: బిందుమాధవిపై ముమైత్ షాకింగ్ కామెంట్స్.. నెక్స్ట్ ఎలిమినేట్ ఎవరో ముందే చెప్పేసిందిగా..
బిగ్‌బాస్ నాన్ స్టాప్ (Bigg Boss non stop ).. నో కామా.. నో ఫుల్ స్టాప్.. 24 గంటలు వినోదాన్ని
బిగ్‌బాస్ నాన్ స్టాప్ (Bigg Boss non stop ).. నో కామా.. నో ఫుల్ స్టాప్.. 24 గంటలు వినోదాన్ని అందిస్తుంది. బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఎట్టకేలకు తొలి వారం పూర్తి చేసుకుంది. మొదటి వారంలోనే ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. వారియర్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముమైత్ అనుహ్యంగా ఫస్ట్ వీక్‌లోనే బయటకు వచ్చేసింది. అయితే ముందు సీజన్లకు నిర్వహించినట్టుగానే…\ బిగ్‌బాస్ నాన్ స్టాప్ షోకు కూడా బజ్ నిర్వహిస్తున్నారు నిర్వాహాకులు.. ఈ బిగ్‌బాస్ నాన్ స్టాప్ బజ్ షోకు యాంకర్ రవి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ముమైత్ ఎపిసోడ్‌ను రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇందులో హీరోయిన్ బిందుమాధవి.. యాంకర్ శివ.. ఆర్జే చైతూ పై ఆసక్తికర వాఖ్యలు చేసింది ముమైత్..
హీరోయిన్ బందు మాదవిని నాగినితో పోల్చింది. తాను కాలుక్యూలేషన్ చేసుకున్నాక గేమ్ ఆడుతుందని.. ఎంతో జాగ్రత్తగా ఉంటుందని చెప్పింది. అలాగే సరయుకు మహానటి ట్యాగ్ ఇచ్చింది. అలాగే శ్రీరాపాకకు పొగరు అని చెబుతు.. అజయ్ మంచి మనసు ఉన్నవాడంటూ అతనికి లవ్ సింబర్ ఇచ్చేసింది. ఇక ఆర్జే చైతూ చాలా ఫేక్ అని.. తన తర్వాత ఆర్జే చైతూ ఎలిమినేట్ కాబోతున్నాడంటూ చెప్పింది. తాను ఎలిమినేట్ కావడం వల్లే యాంకర్ శివ, ఆర్జే చైతూ.. బిందు మాదవి, శ్రీరాపాకలు ఆనందంగా ఉన్నారని చెప్పింది.. చివరగా.. యాంకర్ శివ వయసు 25 అని.. తన వయసు 36 అని.. అతని గురించి తాను ఏం అనుకుంటున్నాదో అర్థం చేసుకోవాలంటూ చెప్పుకొచ్చింది.
Also Read: Keerthy Suresh: బుట్టబొమ్మ పూజ హబిబో పాటకు మహానటి ఫిదా.. కీర్తిసురేశ్ డ్యాన్స్ వీడియో వైరల్
Prabhas: పాన్ ఇండియా హీరో ప్రభాస్.. ఆ విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారా.?
Krithi Shetty: లక్కీ ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ.. మరో యంగ్ హీరోతో నటించే అవకాశం.?
Sharwanand: ఎట్టకేలకు హిట్ కొట్టిన కుర్ర హీరో.. ఆడాళ్లూ మీకు జోహార్లుతో ఆకట్టుకున్న శర్వా..