OTT Movie : థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఊహించని విజువల్స్.. ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ..
అనుక్షణం ఊహించని ట్విస్టులు.. వణుకుపుట్టించే విజువల్స్ మూవీస్ చూసేందుకు సినీప్రియులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ చిత్రాలకు రోజు రోజుకు మరింత ఆదరణ లభిస్తుంది. తాజాగా మరో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ?

చాలా కాలం తర్వాత టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు లవర్ బాయ్ గా సినీరంగంలో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ హీరో.. ఆ తర్వాత వరుస ప్లాపులతో సినిమాలకు దూరమయ్యాడు. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వరుణ్ సందేశ్.. బిగ్ బాస్ రియాల్టీ షోతో తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పుడిప్పుడే విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ మరోసారి నటుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇటీవలే విరాజి అనే సైకలాజికల్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 2న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్, పోస్టర్స్ ద్వారా క్యూరియాసిటీ కలిగించిన ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు.
తాజాగా ఈ సినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. విరాజీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 18 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కానీ రూ.99 రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. గతేడాది ఆగస్ట్ 22నే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలోకి వచ్చేసింది ఈ మూవీ. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రెంటల్ విధానంలో ఎంట్రీ ఇచ్చింది.
డైరెక్టర్ ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ సందేశ్ డిఫరెంట్ గెటప్ లో కనిపించారు. ఈ సినిమాకు విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులో ప్రమోదిని, రఘు కారుమంచి, బలగం జయరాం, రవితేజ నానిమ్మల, వైవా రవితేజ కీలకపాత్రలు పోషించారు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన








