Karthikeya 2: కార్తికేయ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే.. ఎప్పుడో తెలుసా..

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5లో కార్తికేయ 2 స్ట్రీమింగ్ కానున్నట్లుగా గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు

Karthikeya 2: కార్తికేయ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే.. ఎప్పుడో తెలుసా..
Karthikeya 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 26, 2022 | 7:36 PM

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (nikhil siddarth) కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ చందు మోండేటి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అటు నార్త్ ఆడియన్స్‏ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కార్తికేయ 2 (Karthikeya 2) సినిమాపై బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇందులో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. అన్ని భాషల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే చాలాసార్లు కార్తికేయ 2 ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5లో కార్తికేయ 2 స్ట్రీమింగ్ కానున్నట్లుగా గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

తాజా సమాచారం ప్రకారం దసరా కానుకగా అక్టోబర్ 5 కార్తికేయ 2 ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో వరుస ట్వీట్స్ వస్తున్నాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుందట. అక్టోబర్ 5న జీ5లో కార్తికేయ 2 స్ట్రీమింగ్ అంటూ వచ్చి పలు పోస్టులను హీరో నిఖిల్ సిద్దార్థ్ లైక్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. అయితే జీ5 ప్లాట్ ఫాం నుంచి ఇప్పటివరకు కార్తికేయ 2 స్ట్రీమింగ్ డేట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అతిథిపాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.