Ante Sundaraniki: ఓటీటీలో సందడి చేసేందుకు సుందరం, లీల వచ్చేస్తున్నారు.. నెట్‏ఫ్లిక్స్‎లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?..

అంటే సుందరానికీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

Ante Sundaraniki: ఓటీటీలో సందడి చేసేందుకు సుందరం, లీల వచ్చేస్తున్నారు.. నెట్‏ఫ్లిక్స్‎లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?..
Ante Sundaraniki
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 03, 2022 | 7:05 PM

న్యాచురల్ స్టార్ నాని (Nani), డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన చిత్రం అంటే సుందరానికీ (Ante Sundaraniki). ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నానికి జోడిగా మలయాళ బ్యూటీ నజ్రీయా నజీమ్ కథానాయికగా నటించింది. నజ్రీయాకు తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. జూన్ 10న విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో బ్రహ్మణ అబ్బాయి సుందరం పాత్రలో నాని అలరించగా.. క్రిస్టియన్ అమ్మాయి లీలా థామస్ పాత్రలో నజ్రీయా మెప్పించింది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుందరం ఇప్పుడు డిజిటల్ సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధం అయ్యాడు.

అంటే సుందరానికీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జూలై 10న అంటే సుందరానికీ మూవీ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆదివారం మేకర్స్ సోషల్ మీడియా వేదికంగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్త మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‏గా నిర్మించింది. ఇక నాని సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా మూవీ చేస్తున్నాడు న్యాచురల్ స్టార్. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. సింగరేణి నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు