AAS-Aha: ఏజెంట్ ఆనంద్ సంతోష్‏గా రాబోతున్న షన్ను.. ఆహాలో సరికొత్త వెబ్ సిరీస్..

ఆ తర్వాత ఈ యూట్యూబ్ స్టార్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఏజెంట్ ఆనంద్ సంతోష్ అంటూ రాబోతున్నాడు షన్ను.

AAS-Aha: ఏజెంట్ ఆనంద్ సంతోష్‏గా రాబోతున్న షన్ను.. ఆహాలో సరికొత్త వెబ్ సిరీస్..
Shannu
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 03, 2022 | 8:45 PM

ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్, సూపర్ హిట్ చిత్రాలతో సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. థ్రిల్లింగ్ వెబ్ సిరీస్..ఇతర భాషల బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను డబ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా.. ఇప్పుడు సరికొత్త వెబ్ సిరీస్‏ను తీసుకువస్తుంది. అదే ఏజెంట్ ఆనంద్ సంతోష్. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఫాలోయింగ్ గురించి తెలిసిన విషయమే. సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో షన్ను క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన సూర్య సిరీస్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ ఆఫర్ అందుకున్నాడు షన్ను. టైటిల్ వరకు పోటిపడి రన్నరప్ గా నిలిచాడు.

బిగ్ బాస్ తర్వాత షన్ను పెద్దగా కనిపించనుంది. ఆ తర్వాత ఈ యూట్యూబ్ స్టార్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఏజెంట్ ఆనంద్ సంతోష్ అంటూ రాబోతున్నాడు షన్ను. ఈ సిరీస్ కు డైరెక్టర్ అరుణ్ పవర్ దర్శకత్వం వహిస్తుండగా.. సుబ్బు స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటిస్తూ.. షన్ను ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది ఆహా.. అందులో చేతిలో సూట్ కేస్ పట్టుకుని ఉండగా.. దానిపై కేస్ క్లోజ్డ్ అని కనిపిస్తుంది. ఇప్పటివరకు లవర్ బాయ్‏గా వెబ్ సిరీస్ లలో అలరించిన షన్ను ఇప్పుడు డిటెక్టివ్‏గా మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.