Tamil Rockers: అసలీ తమిళ్‌ రాకర్స్‌ ఎవరు.? ఎక్కడుంటారు.? ఆసక్తి రేకెత్తిస్తోన్న టీజర్‌..

Tamil Rockers Teaser: సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తోన్న ప్రధాన సమస్య పైరసీ. ఎన్నో ఏళ్ల నుంచి పైరసీ భూతానికి ఇండస్ట్రీ నష్టాలను చవి చూస్తోంది. థియేటర్‌లో వచ్చిన మరుసటి రోజే..

Tamil Rockers: అసలీ తమిళ్‌ రాకర్స్‌ ఎవరు.? ఎక్కడుంటారు.? ఆసక్తి రేకెత్తిస్తోన్న టీజర్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 04, 2022 | 5:04 PM

Tamil Rockers Teaser: సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తోన్న ప్రధాన సమస్య పైరసీ. ఎన్నో ఏళ్ల నుంచి పైరసీ భూతానికి ఇండస్ట్రీ నష్టాలను చవి చూస్తోంది. థియేటర్‌లో వచ్చిన మరుసటి రోజే నెట్టింట పైరసీ హంగామా చేస్తోంది. కంటికి కనిపించరు, ఎక్కడుంటారో తెలియదు కానీ వెబ్‌సైట్స్‌ మాత్రం సినిమాలను అప్‌లోడ్‌ చేసేస్తుంటారు. ఇలాంటి పైరసీ సైట్లలో తమిళ్‌ రాకర్స్‌ ఒకటి. పైరసీ చట్ట విరుద్ధం అని తెలిసినా కొందరు కేటుగాళ్లు కాసుల కక్కుర్తి కోసం అడ్డ దారులు తొక్కుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ తమిళ్‌ రాకర్స్‌ వెబ్‌సైట్‌ను ఆధారంగా తీసుకొని ఓ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్‌కు అరివళగన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇతను ప్రముఖ దర్శకుడు శంకర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కావడంతో వెబ్‌ సిరీస్‌కు మంచి బజ్‌ వచ్చింది. అరుణ్‌ విజయ్‌ ముఖ్య పాత్రలో ఈ సిరీస్‌ తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ వెబ్‌ సిరీస్‌ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ఈ వెబ్‌ సిరీస్‌ టీజర్‌ను విడుదల చేసింది. పైరసీ వల్ల నిర్మాతలు ఎలా నష్టపోతున్నారు.

అసలు కేటుగాళ్లు పైరసీ ఎలా చేస్తున్నారన్న అంశాల ఆధారంగా ఈ సిరీస్‌ తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. టీజర్‌లో వచ్చే ‘అసలీ తమిళ్‌ రాకర్స్‌ ఎవరు.? ఎక్కడుంటారు.?’ అన్న ప్రశ్నలు సిరీస్‌పై అంచనాలు పెంచేశాయి. ఈ వెబ్ సిరీస్ కు ఏవీఎమ్ సంస్థ నిర్మాతగా వ్యవహరించడం మరో విశేషం. అయితే ఈ సిరీస్‌ను తెలుగులోనూ విడుదల చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఆసక్తికరంగా ఉన్న టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు