Pan Card: పాన్ కార్డు వాడేవారికి గుడ్‌న్యూస్.. మారనున్న రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి మార్పులు ఇవే..
పాన్ కార్డు వాడేవారికి ఊరట లభించింది. ఇప్పటివరకు పాన్ కార్డు ద్వారా చేసే పేమెంట్స్‌కు సంబంధించిన లిమిట్‌లలో ఆదాయపు పన్ను శాఖ మారా్పులు చేసింది. బిల్లులు, నగదు డిపాజిట్ల లిమిట్‌ను మరింత పెంచింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను నియమాలను మార్చుతోంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల్లో కీలక మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా పాన్ కార్డు రూల్స్‌లో కూడా భారీ మార్పులు జరగనునున్నాయి. పాన్ కార్డు ఉపయోగించి చేసే నగదు డిపాజిట్ నుంచి భోజన భత్యం వరకు అనేక నియమాలు మారనున్నాయి. ఆదాయపు పన్ను నియమాలు 2026 ఇప్పటికే ఉన్న నిబంధనలను క్రమబద్దీకరిస్తోంది. పాన్ లావాదేవీలు పెంపు, పన్ను చెల్లింపుదారులకు ముందే నింపిన ఫారమ్‌లు, యజమాని భత్యాలలో సర్దుబాట్లు వంటి ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.లక్షకు పెంపు
ఇప్పటివరకు ఏదైనా బ్యాంకులో ఒకరోజు రూ.50 వేలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డు సమర్పించాలి. ఇప్పుడు ఆ పరిమితిని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మంట్ రూ.లక్షకు పెంచింది. దీంతో ఇక నుంచి బ్యాంకులో ఒకరోజులో రూ.లక్ష కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డు అవసరం. ప్రస్తుతం నియమాలపై ప్రజల సలహాలను ఆదాయపు పన్ను శాఖ కోరుతోంది. అనంతరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయనుందని తెలుస్తోంది.
మీల్స్ అలవెన్స్ పెంపు
కంపెనీలు ఉద్యోగులకు మీల్స్ అలవెన్స్ అందిస్తూ ఉంటాయి. ఉద్యోగులకు ఆహార ఖర్చుల కోసం అందించే స్ట్రైఫండ్ ఇది. ఈ మీల్స్ అలవెన్స్‌ను నాలుగు రెట్లు పెంచనున్నారు. ఇప్పుడు రూ.50గా ఉండగా.. దీనిని రూ.200కి పెంచనున్నారు. మార్చి ప్రారంభంలో దీనిని నోటిఫై చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఉద్యోగులకు కంపెనీలు అందించే అలవెన్స్‌లను ప్రస్తుత మార్కెట్‌కు అనుగుణంగా మార్చనున్నారు. పిల్లల విద్య, వ్యక్తిగత ఖర్చుల అలవెన్స్‌లు కూడా ఇందులో ఉండనున్నాయి. వీటి వల్ల ఉద్యోగులకు ప్రయోజనం జరగనుంది.
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సులువు
ఇక ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు మరింత సులువు కానుంది. ఇందుకోసం ముందే నింపిన ఫారమ్‌లను చెల్లిపుదారులకు అందించనున్నారు. వీటిలోని వివరాలను మార్చుకోవచ్చు లేదా ఆమోదించవచ్చు. పేపర్‌లెస్ విధానలో ఐటీఆర్ ప్రక్రియను సులభవంగా అందించడానికి దీనిని రూపొందించనున్నారు. రిటర్న్స్ కోసం పేపర్లు ఉపయోగించే పనిని 50 శాతం తగ్గించారు.
వీటికి పాన్ అవసరం
ఇక నుంచి రూ.5 లక్షలకుపైగా ధరతో కొనుగోలు చేసే మోటార్ వెహికల్స్‌కు మాత్రమే పాన్ అవసరం. ప్రస్తుతం లిమిట్స్‌తో సంబంధం లేకుండా అన్ని వెహికల్స్ కొనుగోలుకు పాన్ అందించాలి. ఇప్పుడు ఆ నిబంధన తొలగించారు. ఇక హోటల్,రెస్టారెంట్, కన్వెన్షన్ వంటి బిల్లులకు రూ.లక్ష దాటితేనే పాన్ అవసరం పడుతుంది. ఇప్పటివరకు ఈ లిమిట్ రూ.50 వేలుగా ఉండేది.
