AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Cards: పాన్ కార్డులపై కేంద్రం షాకింగ్ డెసిషన్.. కోట్లాదిమంది కార్డులు ఇనాక్టివ్.. మీరూ చెక్ చేస్కోండి..

పాన్ కార్డులపై కేంద్ర ప్రభుత్వం షాకింగ్ ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది పాన్ కార్డులను ఇనాక్టివ్ చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంట్‌లో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆర్దికశాఖ సహాయమంత్రి వివరాలు వెల్లడించారు. అలాగే పాన్ కార్డులు ఇనాక్టివ్ అయినవారికి రీఫండ్స్ కూడా నిలిపివేశారు.

Pan Cards: పాన్ కార్డులపై కేంద్రం షాకింగ్ డెసిషన్.. కోట్లాదిమంది కార్డులు ఇనాక్టివ్.. మీరూ చెక్ చేస్కోండి..
Pan Card
Venkatrao Lella
|

Updated on: Apr 03, 2026 | 8:21 PM

Share

పాన్ కార్డులపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కోట్లకుపైగా పాన్ కార్డులను కేంద్ర ప్రభుత్వం డీయాక్టివేట్ చేసింది. ఆధార్ కార్డుతో పాన్ కార్డులను లింక్ చేసుకోలేదనే కారణంతో కోట్లాది మంది కార్డులను ఇనాక్టివ్ చేసింది. ఈ మేరకు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరీ పార్లమెంట్‌లో వెల్లడించారు. ఎంపీలు కార్తి చిదంబరం, అమర్ సింఘ్, బెన్నీ బెహనన్ పార్లమెంట్‌లో పాన్ కార్డులకు సంబంధించి ప్రశ్నించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఏకంగా ఒకేసారి దేశవ్యాప్తంగా కోట్లాదిమంది పాన్ కార్డులను ఇనాక్టివ్ చేయడం సంచలనం రేపుతోంది.

9.25 కోట్ల మంది పాన్ కార్డులు..

దేశవ్యాప్తంగా 9.25 కోట్ల పాన్ కార్డులు ఇన్‌క్టివ్ చేసినట్లు పంకజ్ చౌధరి వెల్లడించారు. ఆధార్‌తో లింక్ చేయని కారణంతో జనవరి 1,2026 నాటికి 9,25,50,668 పాన్ కార్డులు పని చేయకుండా ఇనాక్టివ్ చేసినట్లు తెలిపారు. ఇక ఈ ఏడాది మార్చి నాటికి ఆలస్యంగా అనుసంధానం చేసుకున్నవారి నుంచి రూ.2338 కోట్లు జరిమానా రూపంలో వచ్చాయని స్పష్టం చేవారు. అయితే పాన్ కార్డు ఇనాపరేటివ్ అయినా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ప్రీపెయిడ్ ట్యాక్స్ క్రెడిట్ సేవలు అందించామని చెప్పారు. కేవలం రీఫండ్ మాత్రం నిలిపివేసినట్లు తెలిపారు. 1.30 కోట్ల మంది రీఫండ్ ఆపివేసినట్లే పేర్కొన్నారు. పాన్ కార్డులు ఇనాక్టివ్ కావడం వల్ల పనిచేయవు. దీని వల్ల రీఫండ్స్ అందలేదని తెలుస్తోంది. రూ.340 కోట్ల విలువ చేసే రీఫండ్స్ నిలిపివేశారు.

పాన్ కార్డు ఇనాక్టివ్ అయితే..

ఆలస్య రుసుంతో పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవడానికి కేంద్రం గడువు  ఇచ్చింది. కానీ ఆ గడువులోపు కూడా చాలామంది చేసుకోలేదు. దీంతో వారి పాన్ కార్డులను ఇనాక్టివ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల పాన్ కార్డు నుంచి ఎలాంటి సర్వీసులు పొందలేరు. కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. ఇన్ కమ్ ట్యాక్స్ రీఫండ్స్ పొందలేరు. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్నులు పొందలేరు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టలేరు.

Follow Us