AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Tips: క్రెడిట్ కార్డులు వాడేవారికి బాదుడు తప్పదు.. ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు జాగ్రత్త..

క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? అయితే మీకో అలర్ట్. క్రెడిట్ కార్డులను వాడేవారు ప్రతీఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోవాల్సి ఉంటుంది. ఛార్జీలు, రివార్డ్స్ పాయింట్లు, జీఎస్టీ వంటి ఛార్జీల గురించి మీకు తెలుసా..? వేటికి ఎంత వసూలు చేస్తారనేది ఇప్పుడు చూద్దాం.

Credit Card Tips: క్రెడిట్ కార్డులు వాడేవారికి బాదుడు తప్పదు.. ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు జాగ్రత్త..
Credit Card Bill Management
Venkatrao Lella
|

Updated on: Feb 12, 2026 | 9:27 PM

Share

ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల్లో చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. సామాన్యులు కూడా క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. అయితే వీటిని ఉపయోగించేవారి నుంచి బ్యాంకింగ్ సంస్థలు అనేక ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటాయి. వీటి గురించి చాలామందికి అవగాహన లేక నష్టపోతూ ఉంటారు. వార్షిక మెయింటెన్స్ ఛార్జీలు, నగదు అడ్వాన్స్, ఆలస్యపు, జీఎస్టీ, వడ్డీ ఛార్జీల గురించి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఏ ఏ సమయాల్లో ఛార్జీలు విధిస్తారు..? ఎంతవరకు ఉంటుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వడ్డీ ఛార్జీలు ఇలా..

క్రెడిట్ కార్డు బిల్లును డ్యూ డేట్ కల్లా చెల్లించాలి. లేకపోతే ఆ తర్వాత వడ్డీ వసూలు చేస్తారు. భారత్‌లోని బ్యాంకులతో పాటు క్రెడిట్ కార్డులు జారీ చేసే సంస్థలు 18 నుంచి 42 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. దీంతో క్రెడిట్ కార్డు బిల్లు మిస్సయితే భారీగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దీని వల్ల అప్పుల ఊబిలోకి వెళ్లే అవకాశముంది. ఇక మినిమం బ్యాలెన్స్ డ్యూ చెల్లించినా మిగిలిన బ్యాలెన్స్‌పై వడ్డీ పడుతుంది. ఇలా అయినా మీకే నష్టం జరుగుతుంది.

జీఎస్టీ రుసుంలు

ఇక క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్లపై జీఎస్టీ కూడా ఉంటుంది. జీఎస్టీ రేట్ల ప్రకారం వీటిని వసూలు చేస్తారు. వడ్డీతో పాటు లేట్ ఛార్జీలు, ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీలు, వార్షిక నిర్వహణ ఖర్చులపై జీఎస్టీ విధిస్తారు. జీఎస్టీ 18 శాతం వరకు ఉంటుంది. ఇక క్రెడిట్ కార్డుల ద్వారా చేసే టికెట్ల బుకింగ్, పెట్రోల్ చెల్లింపులకు జీఎస్టీతో పాటు అదనంగా సర్ ఛార్జి కూడా విధిస్తారు.

బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తే..

ఇక ఒక బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నుంచి మరోక బ్యాంక్‌ క్రెడిట్ కార్డుకు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసినా ఛార్జీలు పడతాయి. ట్రాన్స్‌ఫర్ చేసే మొత్తంలో 1 నుంచి 3 శాతం వరకు ఈ ఛార్జీ ఉంటుంది.

రివార్డ్స్ క్లెయిమ్‌కు కూడా..

ఇక క్రెడిట్ కార్డు వాడినప్పుడు మీకు వచ్చే రివార్డ్స్ పాయింట్స్‌ను రిడెంప్షన్ చేసుకునేందుకు కూడా అదనపు ఛార్జీల వసూలు ఉంటుంది. రివార్డుల మొత్తం విలువ నుంచి ఈ ఛార్జీలను తీసుకుంటారు.

వీటికి కూడా ఫీజులు

ఇక క్రెడిట్ కార్డ్ పోయినప్పుడు కొత్త క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటాం. దీంతో కార్డు రీప్లేస్‌మెంట్ ఫీజ కింద రూ.100 నంచి రూ.500 వరకు వసూలు చేస్తారు. కొన్ని సంస్థలు ఉచితంగా కొత్త క్రెడిట్ కార్డును జారీ చేస్తున్నాయి. ఇక మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ ఫిజికల్ కాపీకి రిక్వెస్ట్ పెట్టినా ఛార్జీలు వసూలు చేస్తారు. ఒక్కొ స్టేట్‌మెంట్‌కు రూ.50 నుంచి రూ.200 ఛార్జీ ఉంటుంది.