Krishna Vamsi: ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న క్రియేటివ్‌ డైరెక్టర్‌.. ఏకంగా రూ. 300 కోట్ల బడ్జెట్‌తో భారీ ప్లాన్‌..

Krishna Vamsi: కరోనా తర్వాత ఓటీటీ రంగం పుంజుకుంది. స్టార్‌ నటీనటులు కూడా వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తుండడంతో ఓటీటీకి మరింత క్రేజ్‌ పెరుగుతోంది. దర్శకులు కూడా ఓటీటీ కంటెంట్‌ వైపు దృష్టి సారిస్తున్నారు...

Krishna Vamsi: ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న క్రియేటివ్‌ డైరెక్టర్‌.. ఏకంగా రూ. 300 కోట్ల బడ్జెట్‌తో భారీ ప్లాన్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 03, 2022 | 6:41 PM

Krishna Vamsi: కరోనా తర్వాత ఓటీటీ రంగం పుంజుకుంది. స్టార్‌ నటీనటులు కూడా వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తుండడంతో ఓటీటీకి మరింత క్రేజ్‌ పెరుగుతోంది. దర్శకులు కూడా ఓటీటీ కంటెంట్‌ వైపు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకులు ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి మెప్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో తెలుగు దర్శకుడు చేరనున్నారు. ఆయనే క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ. ప్రస్తుతం రంగమార్తాండ సినిమాతో బిజీగా ఉన్నారు కృష్ణవంశీ. గత కొన్ని రోజులుగా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయిన కృష్ణవంశీ ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా కృష్ణవంశీ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలిపారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఓటీటీ ప్రాజెక్ట్‌ చేయాలనుకుంటున్నా. అన్నీ కుదిరితే ఈ ప్రాజెక్ట్‌ వచ్చే ఏడాదిలో మొదలుపెడతాను. ఇప్పుడే ప్రాజెక్ట్ గురించి చెప్పలేను కానీ.. తప్పకుండా అది పెద్ద ప్లాన్‌ అవుతుంది. రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకూ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ సిద్ధమయ్యే అవకాశం ఉంది. మనం ఏది అనుకుంటే అది తీసే స్వేచ్ఛ ఓటీటీలో ఉంటుంది. నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం కూడా ఉండదు’ అని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. మరి కృష్ణ వంశీ చేస్తోన్న ఈ భారీ ప్లాన్‌ ఓటీటీ రంగంలో ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్