బాలీవుడ్‌లోకి ‘భీష్మ’.. హీరో కూడా ఫిక్స్‌ అయ్యాడా..!

ఇటీవల కాలంలో టాలీవుడ్ రేంజ్ మిగిలిన ఇండస్ట్రీల్లో చాలా పెరిగిపోయింది. వైవిధ్య కథలతో పాటు మంచి విజయాలతో టాలీవుడ్ గ్రాఫ్ క్రమేపి పెరుగుతూ ఉంది.

బాలీవుడ్‌లోకి 'భీష్మ'.. హీరో కూడా ఫిక్స్‌ అయ్యాడా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 24, 2020 | 5:43 PM

ఇటీవల కాలంలో టాలీవుడ్ రేంజ్ మిగిలిన ఇండస్ట్రీల్లో చాలా పెరిగిపోయింది. వైవిధ్య కథలతో పాటు మంచి విజయాలతో టాలీవుడ్ గ్రాఫ్ క్రమేపి పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఇక్కడి కథలపై మిగిలిన దర్శకనిర్మాతలు, హీరోల కన్ను పడింది. దీంతో పలు చిత్రాలు బాలీవుడ్‌లో సైతం రీమేక్‌ అవుతున్నాయి. మొన్నటికి మొన్న అర్జున్ రెడ్డి మూవీ హిందీలో రీమేక్‌ అయ్యి పెద్ద విజయాన్ని సాధించగా.. ఇప్పుడు జెర్సీ రీమేక్‌ను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఎఫ్‌ 2 రీమేక్‌ కూడా త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం మరో టాలీవుడ్ చిత్రం భీష్మ హిందీలో రీమేక్‌ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా హక్కులు తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు హీరోను కూడా ఫైనల్ చేసినట్లు టాక్. బాలీవుడ్ లవర్ బాయ్‌ రణ్‌బీర్ కపూర్‌ ఈ రీమేక్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా రానున్నట్లు టాక్‌. కాగా రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన భీష్మను వెంకీ కుడుముల తెరకెక్కించగా.. నితిన్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాగా.. మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.

Read This Story Also: లాక్‌డౌన్‌: కదిలొచ్చిన కోలీవుడ్.. ఏం చేశారంటే..!