పవన్‌, రాజమౌళి, ఎన్టీఆర్‌లపై ‘కేజీఎఫ్‌’ దర్శకుడి ఇంట్రస్టింగ్ కామెంట్స్..!

కేజీఎఫ్‌ సినిమాతో భారత సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు ప్రశాంత్ నీల్. ఈ సినిమాను ఆయన తెరకెక్కించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వినిపించాయి.

పవన్‌, రాజమౌళి, ఎన్టీఆర్‌లపై 'కేజీఎఫ్‌' దర్శకుడి ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 24, 2020 | 5:49 PM

కేజీఎఫ్‌ సినిమాతో భారత సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు ప్రశాంత్ నీల్. ఈ సినిమాను ఆయన తెరకెక్కించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వినిపించాయి. అంతేకాదు 2018లో బ్లాక్‌ బస్టర్ హిట్ కొట్టిన చిత్రాల సరసన ఈ మూవీ నిలిచింది. ఇక ఇప్పుడు కేజీఎఫ్‌ సీక్వెల్‌ను ఆయన తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో సినిమాల షూటింగ్‌లకు బ్రేక్ పడగా.. ప్రశాంత్ ఇంటికి పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో కాసేపు చాట్ చేశారు. ఆ సమయంలో వారు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

ఈ సందర్భంగా కొంతమంది నెటిజన్లు టాలీవుడ్ ప్రముఖులైన రాజమౌళి, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్‌లపై మీ అభిప్రాయం చెప్పండని అడగ్గా.. రాజమౌళి ఓ సృష్టికర్త, పవన్‌కు ఉన్న ఫాలోయింగ్‌ అన్‌మ్యాచబుల్‌ అని తెలిపారు. అలాగే ఎన్టీఆర్‌ను ఎవరితో పోల్చలేని నటుడు అంటూ కితాబిచ్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ తదుపరి చిత్రాల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ఇదిలా ఉంటే కేజీఎఫ్ 2, అక్టోబర్ 23నే ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. కాగా కేజీఎఫ్‌ 2 తరువాత ప్రశాంత్.. టాలీవుడ్ హీరోలైన మహేష్‌ బాబు గానీ, ఎన్టీఆర్‌తో గానీ సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.

Read This Story Also: బాలీవుడ్‌లోకి ‘భీష్మ’.. హీరో కూడా ఫిక్స్‌ అయ్యాడా..!