లాక్‌డౌన్‌: కదిలొచ్చిన కోలీవుడ్.. మరోసారి రియల్ హీరోలు అనిపించుకున్నారు..!

కరోనా ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా పలు ఇండస్ట్రీలపై పడింది. ఈ వైరస్ ప్రభావంతో అగ్ర దేశాల స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలాయి. అంతేకాదు సినీ, క్రీడా సహా పలు రంగాలపై కరోనా ఎఫెక్ట్ పడింది.

లాక్‌డౌన్‌: కదిలొచ్చిన కోలీవుడ్.. మరోసారి రియల్ హీరోలు అనిపించుకున్నారు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 24, 2020 | 5:42 PM

కరోనా ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా పలు ఇండస్ట్రీలపై పడింది. ఈ వైరస్ ప్రభావంతో అగ్ర దేశాల స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలాయి. అంతేకాదు సినీ, క్రీడా సహా పలు రంగాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చింది. అంతేకాదు దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతోన్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. దీంతో రోజువారీ వేతనం మీద ఆధారపడే ఎంతోమంది ఇప్పుడు తమ ఉపాధిని కోల్పోయారు. వారిలో సినీ కళాకారులు కూడా ఉన్నారు. ఇక వారిని ఆదుకునే క్రమంలో కోలీవుడ్‌లో సినిమా స్టార్లు ముందడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ పేద కళాకారుల కోసం రూ.50లక్షల విరాళం అందజేశారు.

ఇక అన్నాదమ్ముళ్లైన సూర్య, కార్తిలు పది లక్షల రూపాయాలు అందించారు. సినీ నటుడు విజయ్ సేతుపతి కూడా తన వంతుగా 10లక్షల విరాళం అందించారు. అలాగే శివ కార్తికేయన్ కూడా రూ.10లక్షలు ఫెఫ్సీ(FEFSI)కి విరాళంగా ఇచ్చారు.  మిగిలిన హీరోలు కూడా పేద కళాకారులను ఆదుకునేందుకు ముందు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇటు టాలీవుడ్‌లోనూ కళాకారులను ఆదుకునేందుకు పలువురు హీరోలు ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రాజశేఖర్ దంపతులు కళాకారులకు నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తామని ప్రకటించారు. అలాగే తన ప్రొడక్షన్‌లో పనిచేసే వారిని మే వరకు జీతాలు చెల్లించినట్లు ప్రకాష్‌ రాజ్‌ ఇప్పటికే వెల్లడించారు. వీరితో పాటు కరోనాపై యుద్ధం చేసేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి హీరో నితిన్.. చెరో 10లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు సహాయం చేసేందుకు మన హీరోలు ముందుంటూ రియల్ హీరోలు అనిపించుకుంటుంటారు.