#COVID19 లాక్ డౌన్ సక్సెస్ కు జగన్ సూపర్ డెసిషన్
కరోనా భయం పొంచి ఉంది రోడ్డెక్కకుండా ఇంట్లోనే ఉండేది కొంత కాలం... ప్రాణాలను కాపాడుకోండి అని ప్రభుత్వం చెబుతున్నా.. వినకుండా నిత్యావసరాల పేరిట రోడ్డుపైకి వాస్తు రిస్కు పెంచుతున్న వారి కోసం జగన్ ప్రభుత్వం వెరైటీ నిర్ణయం తీసుకుంది.
CM Jagan has taken a super decision to implementation of lock down: కరోనా భయం పొంచి ఉంది రోడ్డెక్కకుండా ఇంట్లోనే ఉండేది కొంత కాలం… ప్రాణాలను కాపాడుకోండి అని ప్రభుత్వం చెబుతున్నా.. వినకుండా నిత్యావసరాల పేరిట రోడ్డుపైకి వాస్తు రిస్కు పెంచుతున్న వారి కోసం జగన్ ప్రభుత్వం వెరైటీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ తాజాగా జారీ చేసిన ఆదేశాలు అమలైతే నిత్యావసరాల కోసం ఎవరూ రోడ్డు మీదకు రానక్కరలేదు.
కేంద్ర హెచ్చరికల మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మార్చ్ 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆదివారం జనతా కర్ఫ్యూ రోజున చూపించిన స్ఫూర్తిని పూర్తిగా పక్కన పెట్టేసిన జనం పెద్ద సంఖ్యలో లాక్ డౌన్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. పైగా రోడ్డు మీదికి రావడమే లక్ష్యంగా బయటకు వస్తున్నారు.
ఎందుకొస్తున్నారు అంటే సరుకుల కోసమో, కూరగాయల కోసమో అని సాకులు చెబుతున్నారు. అయితే వారిలో కొందరు నిజంగానే సరుకులు, కూరగాయలకు వస్తున్నా విషయం తెలుసుకున్న ప్రభుత్వం.. ప్రతీ కాలనీలోని కూరగాయలు, నిత్యావసర సరుకులను తోపుడు బళ్లపై విక్రహించేలా ఆదేశాలు జారీ చేసారు ముఖ్యమంత్రి.
ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా తోపుడు బళ్లపై నిత్యావసరాలను విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ అడిషనల్ చీఫ్ సెక్రెటారు పివి రమేష్ తెలిపారు. ఫారిన్ నుండి వచ్చిన వారిని శత్రువుల్లాగా చూడవద్దని అయన అన్నారు. విదేశాల నుండి వచ్చిన వారు బాధ్యత తీసుకుని అధికారులకు ఎక్కడున్నారో సమాచారం ఇవ్వాలని, కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని రమేష్ పిలుపునిచ్చారు.
హై రిస్క్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని, లక్షణాలు ఉన్నవారికి దగ్గరగా ఉన్నవారు మాస్కులు వాడితే సరిపోతుందని రమేష్ వివరించారు.