కరోనా ఎఫెక్ట్: వాట్సాప్‌లో రూమర్లు.. ఇద్దరిపై క్రిమినల్ కేసులు
ఇప్పటికే కరోనా భయంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఇండియా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అధికమవడంతో.. అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చినవారిపై కొరడా..
ఇప్పటికే కరోనా భయంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఇండియా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అధికమవడంతో.. అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చినవారిపై కొరడా ఝులిపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల మీదకు వచ్చిన వారిపై భారీ ఫైన్‌లతో పాటు, జైలు శిక్ష కూడా విధిస్తామని అధికారులు ఇప్పటికే తెలియజేశారు. దీంతో దాదాపు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అందులోనూ సోషల్ మీడియాలో కరోనాపై పలు రకాల ఫేక్ వార్తలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. అయితే ఇలాంటి రూమర్లు స్ప్రెడ్ చేసేవారిపై తగు చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు.
ఇప్పుడు ఇలా వాట్సాప్‌లో ప్రచారం చేసే ఇద్దరి వ్యక్తులను పోలీసులు క్రిమినల్ కేసులు బుక్ చేవారు. ఇందులో ఓ యువతి ఉండటం విశేషం. ముంబైలోని కల్యాణ్, ఉల్హాన్ సాగ్ ఏరియాల్లో.. కరోనా పాజిటివ్ కేసులు ఎన్ని ఉన్నాయో అని నకిలీ సమాచారాన్ని వాళ్లు వాట్సాప్‌లో పలువురికి పంపించారు. తన బ్రదర్‌కి కరోనా ఉందంటూ ఓ మేసేజ్ వాట్సాప్‌లో షేర్ చేసింది. ఇది కాస్తా డాక్టర్లు, పోలీసుల వద్దకు చేరడంతో.. వారు షాక్ అయి యువతి ఇంటికి చేరుకున్నారు. అయితే.. పోలీసులను చూసిన ఆ యువతి మాట మార్చింది. ఎవరో తనకు పంపించారని.. అది చదవకుండా అలానే షేర్ చేసినట్టు చెప్పింది. కాగా ఇలాంటివి చేస్తే కేసు తప్పదని పోలీసులు హెచ్చరిండంతో.. ఆ యువతి పోలీసులతోనే గొడవకు దిగింది. దీంతో.. యువతిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
అలాగే ఆదివారం కూడా పోలీసులు మరో కేసు బుక్ చేశారు. షాహాపూర్‌లో ఎమ్మార్వో.. ఓ వ్యక్తికి కరోనా సోకిందని వాట్సాప్‌లో ఓ మెసేజ్ షేర్ చేశాడు. పోలీసులు వెరిఫై చేయగా.. అది నకిలీదని తేలింది. దీంతో అతనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని బట్టి.. మనకు వచ్చే మెసేజ్‌లు నకిలీవి కూడా అయి ఉంటాయి. కాబట్టి కరోనాపై అవగాహనను పెంచాలే తప్ప.. ఇలా తప్పుడు వాటిని షేర్ చేయొద్దని పోలీసులు మరోసారి హెచ్చరించారు.
Read more also: కరోనా బాధితులు తినే ఆహారం ఇదే
రీజన్ లేకుండా.. రోడ్డెక్కితే అంతే.. ప్రజలకు సీరియస్ వార్నింగ్
మీరు సూపరంటూ కేసీఆర్‌ని పొగిడేసిన అమిత్ షా
కరోనాను జయించాలంటే.. ఈ డైట్‌ని మెయిన్‌టైన్ చేయాల్సిందే