AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా పరీక్షలకు 16 ప్రైవేటు ల్యాబ్‌లు.. ఫీజు ఎంతంటే..?

భారత్ లో కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు

కరోనా పరీక్షలకు 16 ప్రైవేటు ల్యాబ్‌లు.. ఫీజు ఎంతంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 24, 2020 | 5:22 PM

Share

భారత్ లో కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు దేశంలో మరో పది ప్రైవేటు ల్యాబ్‌లకు బయో మెడికల్‌ పరిశోధనల సాధికార సంస్థ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్) అనుమతి లభించింది. దీంతో భారత్‌లో కరోనా నిర్ధారణ పరీక్షకు అధికారిక అనుమతి గల ప్రైవేటు ల్యాబ్‌ల సంఖ్య 16కు పెరిగింది. వీటిలో దేశ రాజధాని ఢిల్లీలో 3, గుజరాత్‌లో 2, హరియాణాలో 2, కర్ణాటకలో 1, మహారాష్ట్ర 5, తమిళనాడులో 2 ఉండగా…. తెలంగాణాలో జూబ్లీ హిల్స్‌ వద్దనున్న అపోలో హాస్పిటల్స్‌కు కూడా ఈ అనుమతి లభించింది.

భారత్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. మరోవైపు, కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలకు వసూలు చేయవలసిన అత్యధిక మొత్తం రూ.4,500గా కేంద్రం ప్రకటించింది. దీనిలో రూ.1500 స్క్రీనింగ్‌ పరీక్ష నిమిత్తం, రూ.3,000 నిర్ధారణ పరీక్ష కోసం అని ఓ ప్రకటనలో వివరించింది. ఈ నిబంధనను పాటించని సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కూడా కేంద్రం హెచ్చరించింది. ఇక తాజా సమాచారం ప్రకారం కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాల్లో 3,81,739 కాగా మృతుల సంఖ్య 16,558 గా ఉంది. ఇక భారత్‌ విషయానికి వస్తే… కరోనా పాజిటివ్‌గా తేలినవారి సంఖ్య 500, మృతులు 10 మంది అని తెలుస్తోంది.

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్