AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురే మా ప్రపంచం.. పేరెంటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గ్లోబల్ స్టార్ కపుల్

అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ స్టార్ దంపతుల జీవితం ఇప్పుడు వారి ముద్దుల కూతురి చుట్టూనే తిరుగుతోంది. 2018 డిసెంబర్‌లో వివాహం చేసుకున్న ఈ జంట, 2022 జనవరిలో సరోగసీ ద్వారా తమ కుమార్తెకు జన్మనిచ్చారు. తాజాగా ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సింగర్ తన కూతురితో గడిపే క్షణాలు, తన పేరెంటింగ్ అనుభవాలను పంచుకున్నారు.

కూతురే మా ప్రపంచం.. పేరెంటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గ్లోబల్ స్టార్ కపుల్
Priyanka Chopra Jonas1
Nikhil
|

Updated on: May 05, 2026 | 6:30 AM

Share

గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా, అమెరికన్​ సింగర్​ నిక్​ జొనాస్​ తమ కూతురితో ఉన్న అనుబంధం గురించి పంచుకున్నారు. ప్రియాంక కూతురు పుట్టుక గురించి, ఒక తల్లిగా తాను పడుతున్న ఆందోళనల గురించి ఎమోషనల్ అయ్యారు. నిత్యం భయపడుతూనే ఉంటానని, తన గుండె శరీరం వెలుపల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ దంపతుల పేరెంటింగ్ ఆలోచనలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

సరికొత్త అనుభూతి

ఒక పాపకు తండ్రి కావడం వల్ల అబ్బాయిలకు, అమ్మాయిలకు మధ్య ఉన్న తేడాలను గమనించినట్లు తెలిపారు నిక్​. “మేము ఇంట్లో నలుగురు అబ్బాయిలం. రోజూ ఎంతో అల్లరి చేసేవాళ్లం. మా అమ్మ చాలా ఓపికతో మమ్మల్ని పెంచింది. కానీ అమ్మాయిలు చాలా భిన్నంగా ఉంటారు” అని పేర్కొన్నారు. తన కుమార్తె ప్రీ-స్కూల్‌లో తన క్లాస్‌మేట్స్‌తో ప్రవర్తించే తీరు చూసి ఆశ్చర్యపోతుంటానని చెప్పారు. ఆమె ప్రతి విషయాన్ని ఎంతో ఆసక్తిగా, ఆశ్చర్యంగా చూస్తుందని, ఆమెలో ఉన్న ఆ ఉత్సుకతను, జిజ్ఞాసను కాపాడటమే ఒక తండ్రిగా తన బాధ్యత అని వివరించారు. పిల్లల చుట్టూ ఒక మంచి ప్రపంచాన్ని నిర్మించి వారిని ప్రోత్సహించడమే నిజమైన పేరెంటింగ్ అని ఆయన నమ్ముతున్నారు.

ఆడంబరాలు వద్దు

తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. పిల్లలతో జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి పెద్ద పెద్ద ప్లాన్స్ వేయాల్సిన అవసరం లేదని నిక్​ అభిప్రాయపడ్డారు. “నా చిన్నతనంలో నా తల్లిదండ్రులు నాతో గడిపిన ఆ చిన్న చిన్న మధుర క్షణాలే నాపై ఎక్కువ ప్రభావాన్ని చూపాయి. అందుకే భారీ ఖర్చులతో కూడిన ఆడంబరాల కంటే, ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబంతో కలిసి ఉండే సమయం చాలా విలువైనది” అని చెప్పుకొచ్చారు. పిల్లలతో కలిసి ఉన్నప్పుడు ఇతర ఆలోచనలు లేకుండా పూర్తిగా వారికే సమయాన్ని కేటాయించడం ఎంతో ముఖ్యం అని ఆయన స్పష్టం చేశారు.

గ్లోబల్ బ్యూటీ భావోద్వేగం

గ్లోబల్ స్టార్ ప్రియాంక కూడా తన కుమార్తె గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. “నాకు గర్భధారణ సమయంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. అందుకే నా కూతురు నాకొక అద్భుత బిడ్డ. ఆమె పుట్టిన తర్వాత నా ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆగిపోయింది” అని తెలిపారు. ఆమె నెలలు నిండకుండానే పుట్టడం వల్ల ఒక తల్లిగా నాలో నిరంతరం భయం ఉంటుందని చెప్పారు. ఆమె పక్కన లేనప్పుడు నా గుండె నా శరీరం నుండి బయటకు వచ్చి తిరుగుతున్నట్లుగా అనిపిస్తుందని ఎమోషనల్ అయ్యారు. ఆమె పుట్టిన తర్వాత తన ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయని, తన జీవితం ఆమెతోనే మొదలై ఆమెతోనే ముగుస్తుందని చాలా ప్రేమగా చెప్పారు.

Follow Us