AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Jagannadh: లైంగిక సంబంధాన్ని సజీవంగా ఉంచడం ఈ రోజుల్లో చాలా కష్టం..

వైవాహిక జీవితంలో లైంగిక కోరిక కాలక్రమేణా తగ్గుతుందని పూరి జగన్నాథ్ వివరిస్తున్నారు. ప్రారంభ ఉత్సాహం, ఆకర్షణ క్రమంగా మాయమై, రోజువారీ జీవితం, ఒత్తిళ్లు దాని స్థానాన్ని ఆక్రమిస్తాయి. సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రేమ, బాధ్యతలే ముఖ్యమని, లైంగిక కోరిక పారిపోయినా దానికోసం తగాదాలు పడకూడదని ఆయన సూచించారు.

Puri Jagannadh: లైంగిక సంబంధాన్ని సజీవంగా ఉంచడం ఈ రోజుల్లో చాలా కష్టం..
Puri Jagannadh
Ram Naramaneni
|

Updated on: May 05, 2026 | 5:33 AM

Share

దర్శకుడు పూరి జగన్నాథ్ తన తాజా పాడ్‌కాస్ట్‌ ద్వారా మానవ సంబంధాలలో, ముఖ్యంగా వైవాహిక బంధంలో లైంగిక కోరిక మారుతున్న తీరును వివరంగా విశ్లేషించారు. ఆయన చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆడ, మగ మధ్య ఉండే లైంగిక కోరిక ఎక్కువ కాలం నిలబడదు. మొదట్లో ఉండే తీవ్రత కాలక్రమేణా మాయమవుతుంది. ఒక జంట మొదటిసారి కలుసుకున్నప్పుడు, వారిలో ఒక కొత్తదనం, ఎక్సైట్మెంట్ కనిపిస్తాయి. ఈ క్యూరియాసిటీ డోపమైన్, టెస్టోస్టెరాన్ హార్మోన్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఆ సమయంలో ఇద్దరూ “ఒక బ్యూటిఫుల్ సోల్‌ను కలిశాను” అని భావించి, అద్భుతమైన రాత్రులను గడుపుతారు. ఇది ఇలాగే కలకాలం ఉంటుందని భావించి వివాహం చేసుకుంటారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా, రెండేళ్ల తర్వాత జీవితం ఒక రొటీన్‌గా మారిపోతుంది. అప్పటికి మిగిలి ఉన్న ఆకర్షణ వల్ల అప్పుడప్పుడు లైంగిక సంబంధం జరిగినా, అది జరగకపోయినా పెద్ద నష్టంగా భావించరు. ఐదేళ్ల వైవాహిక జీవితం తర్వాత, క్యూరియాసిటీ పూర్తిగా తగ్గిపోతుంది. ఒకప్పుడు “బ్యూటిఫుల్ సోల్” అనిపించిన వ్యక్తి, ఇప్పుడు లావెక్కి సాధారణ పెళ్ళాంలా కనిపిస్తుంది. అలాగే భర్త ఇంటికి రాగానే, భార్య అతన్ని మన్మథుడిలా కాకుండా కేవలం మొగుడుగానే భావిస్తుంది. ప్రతిరోజూ రొమాంటిక్‌గా ఉండడం సాధ్యం కాదని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు.

ఇంటికి రాగానే సమస్యల గురించి మాట్లాడితే అతనికి చిరాకు వచ్చి, ఇద్దరి మధ్య గొడవలు జరిగి, చివరికి ఒకరికొకరు దూరంగా తిరిగి పడుకుంటారు. ఈ సమయంలో భార్యకు తను ప్రేమించబడడం లేదని, లేదా భర్తకు వేరే ఎఫైర్ ఉందని అనుమానాలు వస్తాయి. ఒకప్పుడు ఆమె మాటలు శ్రద్ధగా విన్న అతను, ఇప్పుడు మాట్లాడబోతే చిరాకు పడతాడు. ప్రేమ చచ్చిపోయిందని ఆమె భావించినా, అది నిజం కాదు. భర్తకు తన భార్యపై ఇంకా ఇష్టం, ప్రేమ ఉంటాయి. వివాహం తర్వాత పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యల వంటి అనేక కారణాల వల్ల దంపతుల మధ్య మిగిలిన కొద్దిపాటి కోరిక కూడా అడుగంటిపోతుంది. లైంగిక సంబంధం ఒక విధిగా మారినప్పుడు, దానికి కావాల్సిన కొత్తదనం, ఉత్సాహం ఉండవు. పిల్లలు, బంధువులు, అప్పులు, కష్టాలు వంటి టాపిక్స్ శృంగారాన్ని దూరం చేస్తాయని పూరి జగన్నాథ్ వివరించారు. దంపతులు ఆకర్షణను తగ్గకుండా చూసుకోవాలంటే, సరదాగా జోకులేసుకుంటూ, నవ్వుతూ, ఆడుతూ పాడుతూ ఉండాలి. ముఖ్యంగా ఒకరినొకరు విమర్శించుకోవడం, అవమానించుకోవడం మానేయాలి. ఇటువంటి చర్యలు సంబంధాలను దెబ్బతీసి, మానవ అనుబంధాన్ని దూరం చేస్తాయి. కొన్నిసార్లు ద్వేషం పెరిగి, హత్యలకు దారితీస్తుంది; లోకంలో జరిగే హత్యలలో 80 శాతం లైంగిక సంబంధితమైనవేనని ఆయన ఉదహరించారు. ఈ రోజుల్లో సంబంధాన్ని కాపాడుకోవడమే కష్టమైతే, అందులో లైంగిక సంబంధాన్ని సజీవంగా ఉంచడం ఇంకా కష్టమని పూరి జగన్నాథ్ నొక్కి చెప్పారు. ఇవన్నీ జీవిత సత్యాలు. వృద్ధాప్యంలో తమ “మధుర రాత్రులు” ఎన్ని అని లెక్కపెట్టుకుంటే, అవి వందల్లోనే ఉంటాయని, వేలల్లో ఉండవని ఆయన స్పష్టం చేశారు. బయలాజికల్ ఆంత్రోపాలజిస్ట్ హెలెన్ ఫిషర్ చెప్పినట్లు, కోరిక (Lust), శృంగారం (Romance), అనుబంధం (Attachment) వేర్వేరు భావాలని పూరి జగన్నాథ్ గుర్తు చేశారు.

లోతైన అనుబంధం ఉన్నప్పటికీ లైంగిక కోరిక తక్కువగా ఉండవచ్చు, లేదా భావోద్వేగ అనుబంధం లేకుండా కోరిక ఉండవచ్చు. ప్రేమలో ఉన్నప్పటికీ ప్రారంభ కోరిక తీవ్రతను కోల్పోవచ్చు. కాబట్టి, దంపతుల మధ్య ప్రేమ, బాధ్యత ఉంటే చాలు. లైంగిక కోరిక ఉన్నా లేకపోయినా సంబంధం నిలబడుతుంది. ప్రేమ, శృంగారం కలకాలం కలిసి ఉండటానికి ప్రాణస్నేహితులు కావని, అవి కలిసి వచ్చినప్పుడు మాత్రమే వస్తాయని, ఆ తర్వాత ఒకరు మాయమైపోతారని, అప్పుడు పోయిన వారి కోసం నమ్ముకున్న వారితో గొడవ పడకూడదని పూరి జగన్నాథ్ సూచించారు.

Follow Us