Nayanthara Vignesh: శ్రీవారి సన్నిధిలో కొత్త జంట.. భర్తతో కలిసి వెంకన్నను దర్శించుకున్న నయన్..
Nayanthara Vignesh Wedding: ఏడేళ్ల సుదీర్ఘ ప్రేమాయణాన్ని వివాహ బంధంగా మార్చుకున్నారు నయన తార, విఘ్నేష్. తమిళనాడులోని మహాబలిపురంలో ఓ స్టార్ హోటల్‌లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే...
Nayanthara Vignesh Wedding: ఏడేళ్ల సుదీర్ఘ ప్రేమాయణాన్ని వివాహ బంధంగా మార్చుకున్నారు నయన తార, విఘ్నేష్. తమిళనాడులోని మహాబలిపురంలో ఓ స్టార్ హోటల్‌లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, పలువురు సినీ తారల నడుమ ఈ జంట మూడు మూళ్ల బంధంతో ఒక్కటైంది. ఈ వివాహానికి హాజరైన వారిలో ఇండస్ట్రీ తరఫున షారుఖ్ ఖాన్, నిర్మాత బోనీ కపూర్, డైరెక్టర్ అట్లీ, కార్తీ, సూర్య, రజినీ కాంత్, విజయ్ దళపతితోపాటు మరికొందరు హాజరయ్యారు. ఇక కొత్త జంటకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డిజైనర్ వెయిర్‌లో తనకిష్టమైన రెడ్ కలర్‌లో నయన మెరిసిపోయింది.
వివాహానికి ముందు ఈ జంట కలిసి పలు దేవాలయాలను సందర్శించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పెళ్లితంతు ముగియగానే ఈ కొత్త జంట దైవ దర్శనానికి పయనమైంది. ఈ క్రమంలోనే ఈ క్యూట్ కపుల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమలకు చేరకున్న నయన, విఘ్నేష్ శ్రీవారి కళ్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. కొత్త జంటకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం ముగిసన తర్వాత కొత్త జంటకు ఆలయ అర్చకులు ప్రసాదాలతో పాటు ఆశీర్వాదలను అందించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..