Vishnu Manchu: వినూత్నంగా నయా మూవీ టైటిల్ రివీల్ చేసిన మంచు విష్ణు..
మంచు విష్ణు నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. విష్ణు సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రెండు సినిమాలను లైనప్ చేశాడు విష్ణు.
మంచు విష్ణు(Vishnu Manchu) నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. విష్ణు సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రెండు సినిమాలను లైనప్ చేశాడు విష్ణు. వాటిలో శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఢీ అంటే ఢీ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాతో పాటుగా నూతన దర్శకుడు సూర్య డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో సన్నీ లియోన్ కీలక పాత్ర పోషిస్టున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో సన్నీ నటిస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. అలాగే మెయిన్ హీరోయిన్ గా ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తుంది. ఈ సినిమాకు కోన వెంకట్ కథను అందించారు.
తాజాగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు మంచు విష్ణు అండ్ టీమ్. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ ను వెరైటీగా ప్లాన్ చేశాడు విష్ణు.. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో ముందుగా కమెడియన్ కమ్ హీరో సునీల్ కు ఫోన్ చేసి.. నేను ఓ సినిమా చేయాలనుకుంటున్నా అని విష్ణు అడిగాడు.. మా అసౌసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నావ్ కథ సినిమాలు మానేశావ్ అని విన్నాను అని సునీల్ అనడంతో అదంతా పుకారు.. సోషల్ మీడియాలో ఏవేవో రాస్తుంటారు. అంటాడు. దానికి సునీల్ కథ కోసం కోనా వెంకట్ ను రికమెండ్ చేయడం. కోనా వచ్చి చోటకే నాయుడిని, దర్శకుడు సూర్యను, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ను రికమెండ్ చేస్తాడు. చివరిగా ఈ సినిమాకు టైటిల్ ఏం పెడదాం.? అని విష్ణు కోన వెంకట్ ను అడగ్గా ‘జిన్నా’అని చెప్తాడు. టైటిల్ వెరైటీగా ఉంది.. దీనికి అర్ధం ఏంటి అని విష్ణు అడగ్గా.. గాలి నాగేశ్వరావు .. హీరో పేరు ఇది.. సినిమాలో హీరోకి ఆ పేరు అంటే నచ్చదు. దాంతో తన పేరును జిన్నాగా మార్చుకుంటాడు అని చెప్తాడు. దాంతో విష్ణు ఎగ్జైట్ అయ్యి బాగుంది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇదంతా వీడియో గా చేసి రిలీజ్ చేశారు.