Vikram Movie: విక్రమ్ సినిమా మమ్మల్ని నమ్మి ఇచ్చారు.. ఇప్పుడు సంతోషంగా ఉన్నాం.. ప్రొడ్యుసర్ సుధాకర్ రెడ్డి..

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలలో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి

Vikram Movie: విక్రమ్ సినిమా మమ్మల్ని నమ్మి ఇచ్చారు.. ఇప్పుడు సంతోషంగా ఉన్నాం.. ప్రొడ్యుసర్ సుధాకర్ రెడ్డి..
Vikram Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 09, 2022 | 9:08 PM

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం విక్రమ్. జూన్ 3న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలలో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో హీరో నితిన్ తండ్రి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి తమ సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌ ద్వారా విడుద‌ల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400 థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేసి మంచి స‌క్సెస్‌ను సాధించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. “క‌మ‌ల్ హాస‌న్ అభిమాని అయిన‌ ద‌ర్శ‌కుడు లోకేష్ కనగరాజ్ తీశాడంటే ఖ‌చ్చితంగా మంచి సినిమా అనే న‌మ్మ‌కం క‌లిగింది. ఒక అభిమాని ద‌ర్శ‌కుడు అయి సినిమా తీస్తే ఎలా వుంటుంద‌నేది హ‌రీష్ శంక‌ర్ ద్వారా తెలుసుకున్నాం. అప్ప‌టికే ద‌ర్శ‌కుడు లోకేష్ కనగరాజ్ రెండు హిట్ సినిమాలు ఇచ్చాడు. కాబట్టి విక్ర‌మ్ మ‌న‌మే రిలీజ్ చేస్తే బాగుంటుంద‌ని అనుకున్నాం. క‌మ‌ల్ గారు మ‌మ్మ‌ల్ని న‌మ్మి ఇచ్చారు. ఇప్పుడు చాలా హ్యాపీగా వుంది. కేవలం దర్శకుడిపై ఉన్న నమ్మకంతోనే విక్రమ్ సినిమాను తీసుకున్నాం.. విడుదలకు ముందు మేము చూడలేదు.. ఈ సినిమాను 370 నుంచి 400 స్క్రీన్ల‌లో వేశాం. థియేట‌ర్లు పెర‌గ‌లేదుకానీ మ‌ల్టీప్లెక్స్ షోలు పెరిగాయి. మౌత్ టాక్‌ తో మొద‌టిరోజు నుంచే క‌లెక్ష‌న్లు బాగున్నాయి. నేటికీ అలానే వున్నాయి. ఇది ద‌ర్శ‌కుడి సినిమా. ద‌ర్శ‌కుడు స్ట‌ఫ్ నాకు బాగా తెలుసు. పైగా క‌మ‌ల్ హాస‌న్ గారి స్వంత బేన‌ర్ రాజ్‌ క‌మ‌ల్ సంస్థలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీశారు. ఇంకోవైపు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య వంటి ప్ర‌ముఖుల కాంబినేష‌న్‌కూడా ఓ కార‌ణం. ఈ సినిమా తీసుకున్నప్పుడు 20 శాతం రిస్క్ ఉంటుందనుకున్నాం.. అయిన తీసుకున్నాం”అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి