Mahima Chaudhry: క్యాన్సర్ బారిన పడిన మరో హీరోయిన్.. భావోద్వేగ పోస్ట్ చేసిన మహిమా..

ఈ విషయాన్ని అనుపమ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు.. క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న ఆమె ధైర్యాన్ని, ఆశావాదాన్ని అనుపమ్ ప్రశంసించారు.

Mahima Chaudhry: క్యాన్సర్ బారిన పడిన మరో హీరోయిన్.. భావోద్వేగ పోస్ట్ చేసిన మహిమా..
Mahima Chaudhry
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 09, 2022 | 5:35 PM

సినీ పరిశ్రమలో మరో హీరోయిన్ క్యాన్సర్ బారిన పడింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మహిమా చౌదరి క్యాన్సర్ బారిన పడిందని.. ప్రస్తుతం ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు బీటౌన్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రకటించారు. ఈ విషయాన్ని అనుపమ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు.. క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న ఆమె ధైర్యాన్ని, ఆశావాదాన్ని అనుపమ్ ప్రశంసించారు. మహిమా చౌదరి 1997లో సూపర్ హిట్ అయిన పర్దేస్ సినిమాలో నటించి మెప్పించింది. తన అభిమానులతో ఈ విషయాన్ని నేను చెప్పాలని మహిమా ఆశించారు అంటూ చెప్పుకొచ్చారు అనుపమ్.

అనుపమ్ ఖేర్ తన రాబోయే సినిమా ది సిగ్నేచర్‍లో మహిమా నటించాలని కోరుకున్నాడు. ఈ విషయాన్ని ఆమెతో ప్రస్తావించేందుకు ఫోన్ చేసినప్పుడు.. తాను బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యతో పోరాడుతున్నానని… ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం మా మధ్య జరిగిన సంభాషణలో తెలిసిందని చెప్పుకొచ్చాడు అనుపమ్. ఆమెకు ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్, షోస్ ఆఫర్స్ వచ్చాయని.. కానీ వాటన్నింటిని ఆమె తిరస్కరించిందని తెలిపారు. తన సినిమాలో నటించాలని అనుపమ్ నాకు కాల్ చేశారు.. ఆ సమయంలో నేను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాను. వెబ్ షోలు, సినిమాలలో నటించాలని నాకు ఎన్నో కాల్స్ వస్తున్నాయి. కానీ నేను ఒకే అని చెప్పలేను.. ఎందుకంటే నాకు శిరోజాలు లేవు.. అన్ని సినిమాలకు నో చెప్పినట్టుగా అనుపమ్ సినిమాకు నో చెప్పలేకపోయానని.. అందుకే అతనికి క్యాన్సర్ గురించి నిజం చెప్పాను.. అంటూ అనుపమ్ షేర్ చేసిన వీడియోలో మహిమా ఎమోషనల్ అయ్యారు. బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యకు వంద శాతం చికిత్స చేయవచ్చని వైద్యులు తనతో చెప్పారని.. కానీ ఆ విషయం విన్నప్పుడు తాను భావోద్వేగానికి గురయ్యానని.. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులతో పంచుకోలేదని చెప్పుకోచ్చింది.

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్