Nayanthara Vignesh Wedding: ప్రేమకు పట్టాభిషేకం.. నయన్.. విఘ్నేష్ పెళ్లి కానుకలు ఎన్ని కోట్లో తెలుసా..

ముఖ్యంగా నయనతార చెన్నైలోని అత్యంత ఖరీదైన ఏరియాలోని పాతికకోట్లు పెట్టి ఓ ఇంద్రభవనం లాంటి ఇంటిని కొనుగోలు చేసిందట...

Nayanthara Vignesh Wedding: ప్రేమకు పట్టాభిషేకం.. నయన్.. విఘ్నేష్ పెళ్లి కానుకలు ఎన్ని కోట్లో తెలుసా..
Nayanthara Vignesh Shivan Wedding
Follow us

|

Updated on: Jun 09, 2022 | 4:10 PM

ఏడేళ్ల ప్రేమకు పట్టాభిషేకం.. సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న నయన్, విఘ్నేష్.. నేడు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఓ హోటల్‌ వేదికగా వీరిద్దరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి దక్షిణాది సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ సెలబ్రెటీస్ సైతం హజరయ్యారు. షారుఖ్ ఖాన్, నిర్మాత బోనీ కపూర్, డైరెక్టర్ అట్లీ, కార్తీ, సూర్య, రజినీ కాంత్, విజయ్ దళపతితోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాసేపటి క్రితం ఇద్దరం ఒక్కటయ్యామంటూ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తమ పెళ్లి ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.. ఇక ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో వీరిద్దరి పెళ్లికి సంబంధించిన కట్నకానుకల గురించి చర్చ నడుస్తోంది.

లేడీ సూపర్ స్టార్ గా సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయనతార. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే అగ్రకథానాయికలలో అందరికంటే ఎక్కువగా పారితోషికం తీసుకుంటూ వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ నయనతార మాత్రమే. ఒక్కో సినిమాకు దాదాపు అయిదు కోట్ల పారితోషికం తీసుకుంటుందట. ఇక ఇప్పుడిప్పుడే విఘ్నేష్ శివన్ దర్శకుడిగా సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. పెళ్లికి ముందు వీరిద్దరు ఒకరికొకరు ఖరీదైన బహుమతులు ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నయనతార చెన్నైలోని అత్యంత ఖరీదైన ఏరియాలోని పాతికకోట్లు పెట్టి ఓ ఇంద్రభవనం లాంటి ఇంటిని కొనుగోలు చేసిందట… ఆ ఇంటిని తన భర్త విఘ్నేష్ శివన్ కు బహుమతిగా ఇచ్చిందట.. మరోవైపు విఘ్నేష్ సైతం నయన్ కు ఖరీదైన బంగారు ఆభరణాలతోపాటు వస్తువులను కూడా బహుమానంగా ఇచ్చాడని సమాచారం. ఇక వివాహంలో వీరిద్దరు ధరించిన దుస్తులు, నగల ఖరీదు దాదాపు 5 కోట్లు ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా వీరి పెళ్లికోసం సరికొత్తగా డైమండ్ రింగ్స్ చేయించుకున్నారని..వాటి విలువ ఒక్కొటి కోటి రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీరి పెళ్లి రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ దాదాపు మూడు రెట్ల అధికంగా చెల్లించి తీసుకుందని టాక్ వినిపిస్తోంది.

Latest Articles
కావ్య మారన్ కన్నీళ్లు చూసి బిగ్ బీ ఆవేదన!
కావ్య మారన్ కన్నీళ్లు చూసి బిగ్ బీ ఆవేదన!
విశ్వక్ అండగా బాలయ్య ఉండగా భయమెలా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్.
విశ్వక్ అండగా బాలయ్య ఉండగా భయమెలా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్.
గుండెలదిరే విక్టోరియా ఫాల్స్‌లో మహిళా వీడియో వైరల్‌.!
గుండెలదిరే విక్టోరియా ఫాల్స్‌లో మహిళా వీడియో వైరల్‌.!
బ్రహ్మంగారు చెప్పినట్టే.. వేపచెట్టుకు మామిడికాయలు.. వీడియో.
బ్రహ్మంగారు చెప్పినట్టే.. వేపచెట్టుకు మామిడికాయలు.. వీడియో.
ఓటు వేసేందుకు రక్షణ కావాలని ఎన్నికల సంఘానికి ఓ కుటుంబం విజ్ఞప్తి.
ఓటు వేసేందుకు రక్షణ కావాలని ఎన్నికల సంఘానికి ఓ కుటుంబం విజ్ఞప్తి.
మహేష్‌బాబు పుత్రోత్సాహం.. విదేశాల్లో గౌతమ్ ఉన్నత విద్యాభ్యాసం.
మహేష్‌బాబు పుత్రోత్సాహం.. విదేశాల్లో గౌతమ్ ఉన్నత విద్యాభ్యాసం.
మోదీ వచ్చారు,హోటల్ లో బస చేసి వెళ్లారు,మరి బిల్లు ఎప్పుడు కడతారు?
మోదీ వచ్చారు,హోటల్ లో బస చేసి వెళ్లారు,మరి బిల్లు ఎప్పుడు కడతారు?
అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.2 కోట్లతో ఉడాయించిన పూజారి..
అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.2 కోట్లతో ఉడాయించిన పూజారి..
ఏ శక్తీ తమను ఆపలేదన్న ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం.
ఏ శక్తీ తమను ఆపలేదన్న ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం.
పోలీస్‌ స్టేషన్‌ లలో సీసీ కెమెరాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
పోలీస్‌ స్టేషన్‌ లలో సీసీ కెమెరాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..