Dasara Teaser: దసరా టీజర్‌ వచ్చేసింది.. నాని నటన చూస్తే గూజ్‌బంప్స్‌ గ్యారంటీ..

న్యాచులర్ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'దసరా'. శ్యామ్‌ సింగరాయ్‌, అంటే సుందరానికీ చిత్రాల తర్వాత నాని నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నాని కెరీర్‌లోనే అత్యధికంగా ప్రీరిలీజ్‌ జరుపుకోవడమే ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా చెప్పొచ్చు...

Dasara Teaser: దసరా టీజర్‌ వచ్చేసింది.. నాని నటన చూస్తే గూజ్‌బంప్స్‌ గ్యారంటీ..
Dasara Movie Teaser
Follow us

|

Updated on: Jan 30, 2023 | 4:12 PM

న్యాచులర్ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘దసరా’. శ్యామ్‌ సింగరాయ్‌, అంటే సుందరానికీ చిత్రాల తర్వాత నాని నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నాని కెరీర్‌లోనే అత్యధికంగా ప్రీరిలీజ్‌ జరుపుకోవడమే ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా చెప్పొచ్చు. నాని ఇప్పటి వరకు ఎప్పుడూ నటించని పాత్రలో కనిపించనున్నారు. 1980 తెలంగాణలోని సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ సినిమాపై ఓ రేంజ్‌లో బజ్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా అత్యంత సహజంగా ఉన్న లొకేషన్స్‌ ప్రేక్షకులను గతంలోకి తీసుకెళ్లినట్లు ఉంది. సింగరేణి నేపథ్యంలో చోటుచేసుకున్న సంఘటనలు కళ్లకు కట్టిగనట్లు చూపించనున్నట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నిర్మాణం ఇప్పటికే పూర్తికాగా మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి

విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉండగా చిత్ర యూనిట్‌ ఇప్పటి నుంచే ప్రమోషన్స్‌ మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే సోమవారం సినిమా టీజర్‌ను విడుదల చేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ టీజర్‌ను విడుదల చేశారు. హిందీ టీజర్‌ను షాహిద్‌ కపూర్‌, తమిళ్‌ టీజర్‌ను ధనుష్‌, మలయాళం టీజర్‌ను దుల్కర్‌ సల్మన్‌, కన్నడ టీజర్‌ను రక్షిత్‌ శెట్టి లాంచ్‌ చేశారు. ఇక హైదరాబాద్‌లో టీజర్‌ ఈవెంట్‌ను మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించారు. ఇక టీజర్ విషయానికొస్తే నాని వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్నారు. మునుపెన్నడూ కనిపించని విధంగా ధరణి పాత్రలో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా టీజర్ చివరిలో నోటిలో కత్తి పెట్టుకొని కనిపించే సీన్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles