Ankit gupta: హీరోలకు కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ తప్పదా.? సంచలనం రేపుతోన్న బాలీవుడ్ నటుడి వ్యాఖ్యలు.

క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశం సినిమా ఇండస్ట్రీని ఎంతలా షేక్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో నటించే అవకాశం రావాలంటే నిర్మాతలు, హీరోలు చెప్పింది చేయాల్సిందే అంటూ ఎంతో మంది నటీమణులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు....

Ankit gupta: హీరోలకు కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ తప్పదా.? సంచలనం రేపుతోన్న బాలీవుడ్ నటుడి వ్యాఖ్యలు.
Ankit Gupta
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 30, 2023 | 3:28 PM

క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశం సినిమా ఇండస్ట్రీని ఎంతలా షేక్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో నటించే అవకాశం రావాలంటే నిర్మాతలు, హీరోలు చెప్పింది చేయాల్సిందే అంటూ ఎంతో మంది నటీమణులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. టాప్‌ హీరోయిన్లుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న నటీమణులు సైతం తమకు క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం ఎదురైంది అంటూ చేసిన కామెంట్స్‌ అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.

ఇదిలా ఉంటే క్యాస్టింగ్‌ కౌచ్‌ కేవలం నటీమణులకు మాత్రమే పరిమితమనే ఆలోచనలో ఉంటాం. అయితే తాజాగా బాలీవుడ్‌కు చెందిన ఓ నటుడు చేసిన వ్యాఖ్యలు.. నటులు కూడా దీనికి అతీతులేం కాదా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. హిందీ బిగ్‌బాస్‌ 16వ సీజన్‌లో పాల్గొన్న అంకిత్ గుప్తా ఇటీవల ఎలిమినేట్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంకిత్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభూతిని పంచుకున్నారు.

ఈ సందర్భంగా అంకిత్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఒకతను నన్ను కాంప్రమైజ్‌ అవుతావా? అని అడిగాడు. ఇండస్ట్రీకి వెళ్లాలంటే కొన్ని పద్ధతులుంటాయని, అవి పూర్తి చేస్తేనే అవకాశాలు వస్తాయన్నాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీల పేర్లు చెప్పి వారి ద్వారా లాంచ్‌ చేస్తానన్నాడు. ఇప్పుడు స్టార్లుగా వెలుగుతున్నవారు ఎన్నో త్యాగాలు చేశాకే ఆ స్థాయికి వెళ్లారని చెప్పాడు. అతడలా మాట్లాడుతుంటే షాక్‌గా అనిపించింది. ఇదంతా నా వల్ల కాదు, నేనలాంటివాడిని కాదని చెప్పాను. కానీ అతడు వినిపించుకోలేదు. నన్ను అసభ్యంగా తాకడానికి ప్రవర్తించాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాను’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే అంకిత్‌ గుప్తా ఉదారియన్‌ అనే సీరియల్ ద్వారా బాలీవుడ్‌ ప్రేక్షకులకు చేరువయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..