Tarakaratna: ఆ వార్తలు అవాస్తనం.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే
తారకరత్నకు మరోసారి బ్రెయిన్ అండ్ హార్ట్ టెస్టులు చేశారు. MRI స్కాన్‌తోపాటు కీలక పరీక్షలు నిర్వహించారు. ఈ రిపోర్టులు వచ్చాకే తారకరత్న హెల్త్ కండీషన్‌పై ఓ క్లారిటీ రానుంది.
కొంతమేర నందమూరి అభిమానులకు ఊరటనిచ్చే వార్త ఇది. మాసీవ్ హార్ట్ స్ట్రోక్‌తో బెంగళూరు నారాయణ హృదయాలలో చికిత్స పొందుతున్న నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థతి మెరుగుపడిందని.. ఆయన బాబాయ్, నిర్మాత నందమూరి రామకృష్ణ తెలిపారు. తనకు తానుగా శ్వాస తీసుకుంటున్నారని.. ఆర్గాన్స్ అన్నీ బాగున్నట్లు వివరించారు. అవయవాలు అన్నీ పనిచేస్తున్నాయని తెలిపారు. తారకరత్న ప్రజంట్ వెంటిలేటర్‌పై ఉన్నారని.. మధ్యాహ్నం 1:30 గంటలకు సీటీ స్కాన్ తీశారని.. ఆ రిపోర్ట్ వచ్చాక మెదడు పనితీరు తెలుస్తుందని వెల్లడించారు. అటు హార్ట్ స్పెషలిస్టులతో పాటు న్యూరాలజిస్టులు తారకరత్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. తారకరత్నకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు రామకృష్ణ.
రామకృష్ణ గారి మాటలను బట్టి చూస్తే.. బ్రెయిన్ స్టేటస్ తెలిశాక తదుపరి ఇచ్చే చికిత్సపై క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం కోలుకున్నట్లు చెప్పలేం కానీ ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది. తదుపరి ట్రీట్మెంట్‌కు ఆయన ఎలా రెస్పాండ్ అవుతారన్నది ఇక్కడ ప్రధానాంశం.
తారకరత్న ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి చూసుకుంటున్నారు బాలకృష్ణ. ఎప్పటికప్పుడు వైద్యులతో కోఆర్డినేట్ చేసుకుంటూ తారకరత్న హెల్త్ కండీషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. బాలకృష్ణతోపాటు కుటుంబసభ్యులంతా హాస్పిటల్‌లోనే ఉంటూ తారకరత్న ఆరోగ్యం ఇంప్రూవ్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు తారకరత్న త్వరగా కోలుకోవాలని అటు నందమూరి అభిమానులతో పాటు ఇటు టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..