AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్తరకం కేటుగాళ్లు.. అమ్మాయిలతో చాటింగ్ చేసే వాళ్లే టార్గెట్.. వీళ్లు మామూలోళ్లు కాదండోయ్..

త్రెడ్స్ యాప్‌లో మహిళలతో చాటింగ్ చేసే వారికి ఫోన్లు చేసి.. పోలీసులమంటూ బెదిరించి లక్షలు కొల్లగొడుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను కోవెలకుంట్ల పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆళ్లగడ్డ డి.ఎస్.పి ప్రమోద్ ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు.

కొత్తరకం కేటుగాళ్లు.. అమ్మాయిలతో చాటింగ్ చేసే వాళ్లే టార్గెట్.. వీళ్లు మామూలోళ్లు కాదండోయ్..
Crime News
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Feb 04, 2026 | 9:02 PM

Share

త్రెడ్స్ యాప్‌లో మహిళలతో చాటింగ్ చేసే వారికి ఫోన్లు చేసి.. పోలీసులమంటూ బెదిరించి లక్షలు కొల్లగొడుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను కోవెలకుంట్ల పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆళ్లగడ్డ డి.ఎస్.పి ప్రమోద్ ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడకు చెందిన అక్కపల్లి చంద్రశేఖర్ (32 ) దాసరి సందీప్ కుమార్(27) అనే ఇద్దరు నిందితులు గత కొంతకాలంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. త్రెడ్స్ యాప్ లో అమ్మాయిల ఫోటోలు కింద అసభ్యకరంగా మెసేజ్ లు పెడుతూ చాటింగ్ చేసే వ్యక్తులను టార్గెట్ చేయడం వీరీ పని. కోవెలకుంట్ల కు చెందిన కర్నాటి ప్రతాపరెడ్డి త్రెడ్స్ యాప్ లో మహిళలతో చాటింగ్ చేయడంతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కాడు. వీరు ప్రతాపరెడ్డి ని టార్గెట్ చేశారు. గద్వాల ఎస్ఐని మాట్లాడుతున్నానంటూ బాధితుడు ప్రతాపరెడ్డికి నిందితుడు చంద్రశేఖర్ ఫోన్ చేశాడు.. త్రెడ్స్ యాప్ లో చాటింగ్ చేసిన గద్వాలకు చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.. అంటూ బాధితుడు ప్రతాపరెడ్డిని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన మహిళా భర్త కండక్టర్ అని అతనితో మాట్లాడి సెటిల్మెంట్ చేసుకోవాలని లేకపోతే కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని ప్రతాపరెడ్డిని బెదిరించారు.

చాటింగ్ చేసిన మహిళా ఆస్పత్రిలో కొన ఊపిరితో ఉందని రూ.4 లక్షలు ఇవ్వాలని వారు ప్రతాప్ రెడ్డిని డిమాండ్ చేశారు. దీంతో భయపడి పోయిన బాధితుడు బ్లాక్ మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్ళకు బాధితుడు ప్రతాపరెడ్డి 30 వేలు ఫోన్‌పే చేశాడు. అంతటితో ఆగని సైబర్ నేరగాళ్లు ఇంకా డబ్బు పంపాలని టార్చర్ చేయసాగారు. దీంతో సైబర్ నేరగాళ్ల టార్చర్ భరించలేక ప్రతాపరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ పే ట్రాన్జాక్షన్ ఆధారంగా సైబర్ నేరగాళ్లను గుర్తించారు. కేవలం కేసు నమోదైన ఐదు రోజుల్లోనే నిందితులను గుర్తించి అరెస్టు చేశామని డీఎస్పీ ప్రమోద్ తెలిపారు.

వీడియో చూడండి..

సోషల్ మీడియా ఆధారంగా ఈ ఇద్దరు సైబర్ నేరగాళ్లు ఎస్సైలు కాకపోయినా ఎస్సైలమని బెదిరించి గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా పలువురిని బెదిరించారన్నారు. ఇలా వారి ఫోన్ పే, బ్యాంకు ఖాతాలకు రూ.15 లక్షలు వరకు నగదు బదిలీ చేయించుకున్నట్లు పోలీసుల విచారణలో తెలిసిందని డిఎస్పి ప్రమోద్ తెలిపారు. ఎవరైనా వీరి వలన ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలలో మోసపోయి ఉంటే ఇప్పటికైనా సంబంధిత పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయవచ్చని ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోవెలకుంట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతు నాయక్, ఎస్ఐ మల్లికార్జున రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us