Apple Farming: వారెవ్వా క్యా సీన్ హై.. ఏపీలోని బీడు భూముల్లో కాశ్మీర్ ఆపిల్.. పండిన రైతు పంట..
Apple Farming in Andhra Pradesh: రోజూ ఒక్క యాపిల్ తింటే చాలు.. డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు.. ఈ క్యాప్షన్ అందరికీ సుపరిచితమే.. అయితే అలాంటి నాణ్యమైన యాపిల్ ఎక్కువగా ఎముకలు కొరికే చలిప్రాంతాల్లో మాత్రమే పండుతాయి. కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో యాపిల్ సాగు ఎక్కువగా ఉంటుంది.

రోజూ ఒక్క యాపిల్ తింటే చాలు.. డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు.. ఈ క్యాప్షన్ అందరికీ సుపరిచితమే.. అయితే అలాంటి నాణ్యమైన యాపిల్ ఎక్కువగా ఎముకలు కొరికే చలిప్రాంతాల్లో మాత్రమే పండుతాయి. కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో యాపిల్ సాగు ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాలు తక్కువ చలి ప్రాంతాల్లో కూడా పండే అవకాశం ఉండటంతో చలికాలంలో ఈ రకమైన యాపిల్‌ను పండించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగాలు చేస్తున్నారు రైతులు.. నిన్నటి వరకు తెలంగాణాలో కొంతమంది రైతులు యాపిల్ సాగును ప్రయోగాత్మకంగా చేపడితే.. నేడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా యాపిల్ సాగును చేపట్టి కాయలు కాసేలా ప్రయోగాలకు తెరతీస్తున్నారు. అలా పండిందే ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న యాపిల్ పండు..
ఏపీలోని ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచర్ల మోటు సమీపంలో ఓ రైతు యాపిల్ సాగు చేస్తున్నాడు. తక్కువ చలి ఉన్నా పండే కొన్ని రకాల యాపిల్ మొక్కలను కర్నాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చి తన పొలంలో మొక్కలు నాటాడు. ఏడాది క్రితం నాటిన యాపిల్ మొక్కలకు నేడు పండ్లు కాయడం ప్రారంభించాయి. మరో రెండు నెలల్లో పూర్తిస్థాయి పంట చేతికి వస్తుందని భావిస్తున్నారు. తక్కువ చలిలో కూడా పండే ఈ రకం యాపిల్ మొక్కలు 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తట్టుకుంటాయని చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్దతులు ఉపయోగించి, సేంద్రీయ ఎరువులను వినియోగించి మొక్కలు పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తొలి ఏడాది కావడంతో అక్కడక్కడ కాయలు కనిపిస్తున్నాయి. రెండో ఏడాది నుంచి యాపిల్ కాయలు ఎక్కువగా కాస్తాయన్న ఆశాభావంతో ఉన్నారు. తొలిసారి తమ ప్రాంతంలో యాపిల్ పంట సాగు చేస్తుండటం, వాటికి యాపిల్ పండ్లు కాస్తుండటంతో స్థానిక రైతులు ఆశక్తిగా గమనిస్తున్నారు. ఈ ప్రయోగం ఫలిస్తే ఇక ప్రకాశంజిల్లా బీడు భూముల్లో యాపిల్ సాగు పెద్ద ఎత్తున చేపట్టేందుకు రైతులు సిద్దమవుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
